Prabhas: ప్రభాస్ ని పొగుడుతున్నట్లు లేదు...తిడుతున్నట్లుంది

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె వంటి పాన్‌ ఇండియి సినిమాలతో బిజీగా ఉ‍న్న సంగతి తెలిసిందే.  అయితే  అందులో కొందరు  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Prabhas fans are giving elevations to their hero


స్టార్ హోదా వచ్చేదే హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా భాక్సాఫీస్ ని హీట్ ఎక్కించినప్పుడు. ఆ లీగ్ లోకి ప్రభాస్ ఎప్పుడో వెళ్లిపోయాడు. బాహుబలి చిత్రాలతో ప్రభాస్‌ నేషనల్‌ స్టార్‌గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో అందరికంటే ముందున్నాడు.  దాంతో ఆయన సినిమా అంటే దేశం మొత్తం ఎదురు చూసే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అది ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కే కాకుండా ప్రతీ సిని లవర్ కు గర్వ కారణం. అయితే ఆయన ప్యాన్ ఇండియా మోజులో పడి తెలుగు ప్రేక్షకుల అభిరుచులును ప్రక్కన పెట్టేస్తున్నారని, స్క్రిప్టు సెలక్షన్ లో తడబడుతున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. 

ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు  కొంతమంది ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ ఆసక్తికరంగా మారింది. చిరంజివి తాజా చిత్రం ఆచార్య డిజాస్టర్ కావటంతో ఆ సెటిల్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ప్రెజర్ తీసుకొచ్చి తమ నష్టాలను క్లియర్ చేయమని కోరటంతో తప్పటం లేదు. అయితే పెద్ద సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఇలా జరగటం కొత్తేమీ కాదు. అయితే ఇక్కడే కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. అవి చూసిన మిగతావారు షాక్ అవుతున్నారు. 

తమ హీరో సాహోతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారని, అలాగే రాధేశ్యామ్ తో 120 కోట్లు దాకా నష్టం వచ్చిందని, కానీ ఇప్పటిదాకా ఏ పంపిణీదారుడు కూడా సెటిల్మెంట్ చేయమని అడగలేదని గర్వంగా చెప్తున్నారు. అలాగే ఇంత పెద్ద ప్లాఫ్ లు వచ్చినా ప్రభాస్ తో సినిమాలు చేయటానికి నిర్మాతలు క్యూలు కడుతున్నారని అంటున్నారు. 

 బాహుబలి 2 తర్వాత పాన్‌ ఇండియా మార్కెట్‌లో వదిలిన సాహో, రాధేశ్యామ్‌ డిజాస్టర్స్‌గా మిగిలాయి. అయినా కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి పాన్‌ ఇండియా దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.అందులో నిజం వంద శాతం ఉండచ్చు. అయితే ఈ కామెంట్స్ చూసిన వాళ్లు ప్రభాస్ వల్ల అంత పెద్ద మొత్త నష్టపోయినట్లుగా, అయినా సెటిల్ చేయలేదని గుర్తు చేస్తూ, పనిగట్టుకుని చెప్తున్నట్లు ఉంది కానీ ప్రభాస్ స్టామినాని పొగుడుతున్నట్లు లేదు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట ప్రభాస్‌. ఇప్పటివరకు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే ప్రభాస్‌... ఇప్పుడు అదనంగా రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట. అంటే ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు తీసుకుంటున్నాడన్న మాట. ప్రభాస్ పెంచిన హైక్ ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సినిమాలకు కూడా అప్లై అవుతుందట.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios