Ante Sundaraniki: నజ్రియాకు ఎంత పే చేసారో తెలిస్తే మతిపోతుంది
జూన్ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయిటకు వచ్చింది. అది మరేదో కాదు నజ్రియాకు ఇచ్చిన రెమ్యునరేషన్.
నాచురల్ స్టార్ నాని, మలయాళీ నజ్రియా నజీమ్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి'. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూన్ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయిటకు వచ్చింది. అది మరేదో కాదు నజ్రియాకు ఇచ్చిన రెమ్యునరేషన్.
అందుతున్న సమాచారం మేరకు నజ్రియాకు రెండు కోట్ల రూపాయలు ఈ సినిమా నిమిత్తం పే చేసారు. నజ్రియా కెరీర్ లో ఇది అది పెద్ద రెమ్యునరేషన్ క్రింద చెప్తున్నారు. ఇక నిర్మాతలు అంత పే చెయ్యటానికి కారణం...నజ్రియా సినిమాకు బాగా ప్లస్ అవుతుందనుకున్నారు. అయితే నజ్రియాలో అంతకు మునుపు ఉంటే ఛార్మ్ మిస్సైంది. లవ్ స్టోరీకు తగ్గ గ్లామర్ కనపడలేదు. రిలీజ్ కు ముందు ఆమెకు వచ్చిన క్రేజ్ చూసి...ఓవర్ హైప్ గా భావిస్తన్నారు. నాని, దర్శకుడు వివేక్ పట్టుబట్టి మరీ ఆమెను ఈ ప్రాజెక్టులకి తీసుకొచ్చినట్లు సమాచారం. నటనలో ఆమెకు వంక పెట్టలేం. కానీ రొమాంటిక్ కామెడీకు కావాల్సిన క్రేజ్ తేలేకపోయింది ఆమె.
నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో అంత త్వరగా విడుదల కాదని నిర్మాతలు చెప్పటం విశేషం. ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాలు రెండు వారాలకే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. ఇది గమనించిన హీరో నాని ‘అంటే సుందరానికి’ మూవీ రెండు నెలల వరకూ ఓటీటీలో విడుదల చేయవద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో సుందర్‌గా నాని, లీల పాత్రలో నజ్రియా నజిమ్ కనిపించనున్నారు. నరేశ్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాని కామెడీ, నజ్రియా అందం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కామెడీ బిట్స్ తప్పితే బాగా లెంగ్తి మూవీ ఇదని,. ఫస్టాఫ్ చాలా బోరింగ్ అంటూ కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే మరోసారి హీరో నాని తన నటనతో మెస్మరైజ్ చేశారని అని అయితే అంటున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాను ఎంటర్‌టైనింగ్ పంథాలో చెప్పే ప్రాసెస్ లో అంతగా సక్సెస్ కాలేకపోయారని, చాలా సీన్స్ బోర్ కొట్టించాయని అంటున్నారు ఆడియన్స్. కాకపోతే నేచురల్ కామెడీ, ఎమోషన్స్ ఉన్నంతలో వర్కవుట్ అయ్యే అంశాలు.