దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నయన్ కి పేరుంది. అయితే వ్యక్తిగతంగా మాత్రం తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తుండేది. మొదట్లో నటుడు శింబుతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ అతడితో విడిపోయింది.

ఆ బ్రేకప్ నుండి బయట పడడానికి ఈమెకి చాలానే సమయం పట్టింది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. అతడితో పెళ్లికి కూడా రెడీ అయింది. కానీ కొన్ని కారణాల వలన వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ ప్రేమ కథ కూడా బెడిసి కొట్టడంతో పూర్తిగా నటనపై దృష్టి పెట్టింది. అలాంటి సమయంలో 'నానుమ్ రౌడీథాన్' చిత్ర దర్శకుడు విఘ్నేశ్ తో నయన్ క్లోజ్ అయింది.

ఆ సినిమాల విజయాలు బాహుబలి కంటే మిన్న

వారి స్నేహం ప్రేమగా మారింది. చాలా రోజులుగా అతడితో సహజీవనం చేస్తోంది ఈ బ్యూటీ. బయటకి వీరి ప్రేమ విషయాన్ని చెప్పనప్పటికీ.. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు షేర్ చేయడం, ఇద్దరూ కలిసి ట్రిప్ లకి వెళ్లడం వంటివి చేస్తూ తగమ ప్రేమ విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలను కూడా జరుపుకోవడానికి విదేశాలకు వెళ్లింది ఈ జంట. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం.

దానికి కారణం విఘ్నేశ్ శివన్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడమేనని ప్రచారం. నిజానికి వీరిద్దరి మధ్య పెళ్లి గొడవ చాలా కాలంగానే సాగుతోంది. విఘ్నేశ్ శివన్ ఇంట్లో ఆయనపై పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం జరిగింది. కాగా నయనతార మరికొద్ది కాలం పెళ్లిని దూరంగా పెడదామని చెప్పడంతో విఘ్నేశ్ శివన్ మౌనం వహించారని సమాచారం.

తాజాగా మరోసారి విఘ్నేశ్ పెళ్లి ఒత్తిడి తీసుకురావడంతో.. ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న నయన్ పెళ్లి చేసుకుంటే ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని.. పెళ్లి విషయంలో అయిష్టతని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కోపగించుకున్న విఘ్నేశ్ అక్కడ నుండి వెళ్లిపోయాడట. మరి ఈ విషయంలో ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి!