Asianet News TeluguAsianet News Telugu

Bangarraju :ఓ షాకిచ్చే విషయం,అందుకే రిలీజ్ డేట్ ప్రకనట లేదు

నాగార్జున హీరోగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. తన సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. చైతూ - కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. 

Nagarjuna Bangarraju, isnt ready yet
Author
Hyderabad, First Published Dec 23, 2021, 8:35 AM IST


వచ్చే  సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘భీమ్లా నాయక్' నిలిచయనే ప్రచారం జరిగింది. అయితే లాస్ట్ మినిట్ లో ‘భీమ్లా నాయక్' బయటికి వెళ్ళిపోయింది. థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని నిర్మాతల గిల్డ్ కోరడంతో ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గిందని ప్రకటించారు. అయితే ఈ స్థానంలో మరో సినిమా రావడానికి ప్రయత్నిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా లాక్ చేయలేదు. అయితే ఎందుకు సంక్రాంతి రిలీజ్ గా లాక్ చేయలేదేనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి సంక్రాంతికి రావాలనేది మొదటి నుంచి ‘బంగార్రాజు’ప్లాన్. సోగ్గాడే చిన్నినాయనకు ప్రిక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఇది. 2016 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి సినిమాగా నిలిచింది. అదే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని బంగార్రాజు కూడా సంక్రాంతికి తీసుకురావాలనే నాగ్ ప్లాన్. అయితే మూడు సినిమాలు వుండటంతో ఇప్పటివరకూ ప్రకటన చేయలేదు. అయితే అనూహ్యంగా భీమ్లా నాయక్ తప్పుకున్నాడు. దీంతో బంగార్రాజు నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ వుందని టాక్. 

కాకపోతే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఓ సారి షూటింగ్ పూర్తైతే అప్పుడు ఫైనల్ కాపీ చూసి నాగ్ డిసైజ్ చేస్తాడని అంటున్నారు. ఏవైనా రీషూట్స్ పెట్టాలా లేక యాజటీజ్ వెళ్లిపోవచ్చా అనేది నాగ్ పరిశీలిస్తారట. ఇక రీసంగ్  నాగ్ చేసిన మన్మధుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఫైనల్ కాపీ చూసేకే రిలీజ్ డేట్ ప్రకటన అన్నారట. 
 
అలాగే  థియేటర్ల సమస్య కారణంగా భీమ్లా నాయక్ ని వాయిదా వేయమని కోరిన నిర్మాతల గిల్డ్ బంగార్రాజు విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎంత అనేది కూడా ప్రశ్నార్ధకం అని కొందరంటున్నారు. కాకపోతే భీమ్లా నాయక్ ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. కానీ బంగార్రాజుకు ఆ అవసరం లేకపోవటం కలిసొచ్చే అంశం. 

మరో ప్రక్క మీడియా సర్కిల్స్ లో  జనవరి 15కి ఈ సినిమా రావడం పక్కానే అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ లోని సినిమాలను రెగ్యులర్ గా తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లను చూసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఓ మాదిరి థియేటర్లలో రిలీజ్ చేసి, అవసరమైతే పెంచుకోవచ్చనే ఆలోచనలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. మొత్తానికి 'బంగార్రాజు' మాత్రం వెనక్కి తగ్గడం లేదనేది అసలు విషయం.

Also read Prabhas: ప్రభాస్ సినిమాల్లో కృష్ణంరాజు.. వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్
ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also read పాన్‌ ఇండియా సినిమాలు, కలెక్షన్లపై హీరో సిద్ధార్థ్‌ షాకింగ్‌ ట్వీట్‌.. టార్గెట్‌ ఆ సినిమానేనా?
 

Follow Us:
Download App:
  • android
  • ios