Naga Chaitanya: పరుశురామ్ కు చైతు ట్విస్ట్? ఇప్పుడేం చేయాలి
సర్కారు వారి పాట థియేటర్స్ కు వచ్చిన తర్వాత, వెంటనే నాగ చైతన్యతో సినిమా స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు పరశురాం.
మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో హిట్ సినిమా చేసాక ఏ డైరక్టర్ కు అయినా వరస సినిమాలు ఉంటాయని భావిస్తాము. అయితే పరుశురామ్ పరిస్దితి అలా కనపడటం లేదు. సర్కారువారి పాట సినిమాతో హిట్ కొట్టిన పరుశురామ్ తన తదుపరి చిత్రం మొదలెట్టడానికి చాలా టైమ్ వెయిట్ చెయ్యాల్సిన సిట్యువేషన్ కనపడుతోంది. వివరాల్లోకి వెళితే...
గీత గోవిందం సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు పరశురామ్. దాంతో వెంటనే మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే టాక్ ను అందుకుంటున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత పరశురామ్ తన తదుపరి సినిమా నాగచైతన్య తో చేయబోతున్నారని వార్తలువచ్చాయి.
పరుశురామ్ ...నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య కోసం నాగేశ్వరరావు అనే టైటిల్ తో స్టోరీ రాసుకున్నాడట. ప్రస్తుతం ఇదే స్టోరీని తెరకెక్కిస్తానంటున్నాడు. సర్కారు వారి పాట నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. చైతూతో రష్మిక జోడి కట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగచైతన్య స్క్రిప్టులో ఛేంజెస్ చెప్పారని వినికిడి. కేవలం డైలాగులతో స్క్రిప్టు నడుస్తోందని, సెకండాఫ్ లో కథనం పరుగెట్టడం లేదని చెప్పారట. దాంతో పరుశురామ్ మళ్లీ రీరైట్ చేస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి పరశురామ్ నాగచైతన్య తో సినిమాని ఎప్పుడో చేయాల్సి ఉంది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడేమో నాగచైతన్య మాత్రం ప్రాజెక్టుని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య తన తాజా చిత్రం థాంక్యూ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. అలాంటప్పుడు పరశురాం సినిమాకు వెంటనే డేట్స్ ఇవ్వటం కష్టం. కనీసం ఓ సంవత్సరమైనా నాగచైతన్య కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది.