Asianet News TeluguAsianet News Telugu

'తండేలు' కి షాకింగ్ బడ్జెట్, నెట్ ప్లిక్స్ తో టైఅప్

సబ్జెక్టు పై నమ్మకం, ప్యాన్ ఇండియా రిలీజ్, కార్తికేయ 2 తో హిట్ ఇచ్చిన చందు మొండేటిపై నమ్మకం ఇంత బడ్జెట్ పెట్టించటానికి నమ్మకం కలిగించాయి.

Naga Chaitanya  Chandoo Mondeti film to cost Rs 80 cr? jsp
Author
First Published Sep 21, 2023, 6:15 AM IST


 నాగ చైతన్య ..చందూ మొండేటి( ,  క్రేజీ కాంబోలో మరో మూవీ రాబోతుంది.  ప్రేమమ్ మూవీ తో మంచి హిట్ అందుకున్న వీరు..  త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్‌ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉండబోతోంది. ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అలాగే నాగ చైతన్యతో మరోసారి సాయి పల్లవి నటించనుంది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు వచ్చిన లవ్ స్టోరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మరో వైవిధ్యమైన చిత్రంతో మెప్పించటానికి వీరు సిద్ధమవుతున్నారు. 

ఈ సినిమాపై నమ్మకంతో అల్లు అరవింద్  భారీగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఎనభై కోట్ల దాకా బడ్జెట్ కేటాయించారని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తో టై అప్ అయ్యే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఎనభై కోట్లు అంటే నాగచైతన్య పై రికవరీ చాలా కష్టం. అందులోనూ వరస డిజాస్టర్స్ తో చైతూ దూసుకుపోతున్న టైమ్ ఇది. కానీ సబ్జెక్టు పై నమ్మకం, ప్యాన్ ఇండియా రిలీజ్, కార్తికేయ 2 తో హిట్ ఇచ్చిన చందు మొండేటిపై నమ్మకం ఇంత బడ్జెట్ పెట్టించటానికి నమ్మకం కలిగించాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం . దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.అందుకోసం కొత్త విధానాన్ని అనుసరించారు. ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి ముందే, #NC23 టీం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పర్యటించింది. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ మూవీకి ‘తండెల్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్‌ అని పిలుస్తారట.

బన్నీ వాసు  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..   ''ఈ చిత్రంలో హీరో క్యారక్టర్ తండేలుగా కనిపిస్తాడు. బోట్స్ నడిపే వారిని 'తండేలు' అని అంటారు. అది చాలా పాత పదం. గుజరాత్‌ లోని సూరత్ లో ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ఒక అందమైన ప్రేమకథ.. ఊహించని ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. అలాంటి బోట్ డ్రైవర్ క్యారక్టర్ లో చైతన్య నటించనున్నారు. సినిమా అంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దీని కోసం చాలా రీసెర్చ్ చేశాం. '' అని చెప్పారు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios