Ravi Teja: రవితేజపై ఈ రూమర్ నిజమైతే, కెరీర్ లో చాలా కష్టం

ప్రస్తుతం  శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.

Is Ravi Teja creating problems for Ramarao on Duty producer ?

రవితేజ అనగానే అందరికీ గుర్తొచ్చేది అతని నాచురల్ యాక్టింగ్,అదిరిపోయే ఎనర్జీ. ఈ రెండు  ఒకే హీరోలో ఉండటం అరుదు.  అందుకే లేటుగా ఇండస్ట్రీకు హీరోగా వచ్చినా వెలిగిపోతున్నాడు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది లిస్ట్ లో రవితేజ ఒక్కడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారని టాక్ మొదలైంది. అందుకు కారణం..ఆయన రెమ్యునేషన్ విషయంలో నిరంకుశంగా ప్రవర్తించంటమే అని చెప్తున్నారు.

మొదటి నుంచీ తెలుగులో  రెమ్యునరేషన్ విషయంలో రాజీపడని హీరో ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ మాత్రమే. ఆయన తన డిమాండ్ , తన మార్కెట్ చూసుకుని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు  షూటింగ్ పూర్తయ్యేలోపు అన్ని చెల్లింపులను క్లియర్ చేయమని నిర్మాతలకు క్లియర్ గా చెప్తాడు. స్టార్ స్టేటస్ పోగొట్టుకునే లోపు పూర్తిగా సెటిలవ్వాలనేది ఆయన ఆలోచన. 

అయితే అందులో తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు రవితేజ గురించి మరో టాక్ వినపడుతోంది. అది రెమ్యునరేషన్ విషయంలో  నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు అని.  'ఖిలాడీ' విడుదలకు ముందు నిర్మాత కోనేరు సత్యనారాయణ నుండి అదనపు చెల్లింపును డిమాండ్ చేసిన రవితేజ, సినిమా విడుదలకు ఒక రోజు ముందు చిత్ర నిర్మాతపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాదు ఇప్పుడు పేమెంట్ విషయంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ నిర్మాతకు కూడా సమస్యలు సృష్టిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. రవితేజ చేతిలో వరస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.దాంతో రవితేజ పట్టువిడుపుగా ఉండాలని,  సీనియర్ స్టార్‌కు తగ్గట్టుగా బిహేవియర్  ఉండాలి మరియు నిర్మాతల  టెన్షనన్స్, సమస్యలను కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు.

ఏదైమైనా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాది నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు. క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం  శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా   స్టార్ట్ అయ్యింది.ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు టాక్. ఇంకా వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనుండగా ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios