వాస్తవానికి క్రితం శుక్రవారం  పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్  లో కూడా  హౌస్ ఫుల్ బోర్డులు కనపడలేదు. ఆక్యుపెన్సీ జస్ట్ ఓకే అనిపించింది.


కెరీర్ ప్రారంభం నుంచీ ప‌క్కా యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు గోపీచంద్. కంప్లీట్ యాక్ష‌న్ సినిమా చేసిన‌ప్పుడు గోపీకి మంచి సక్సెస్ లే వ‌చ్చాయి. కాద‌ని.. ఇదిలా ప‌క్క దారి వెళ్లినప్పుడు పక్కాగా ఫ్లాపులు త‌గిలాయి. ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వీకెండ్ ఓ మాదిరిగా లాగింది కానీ..సోమవారం నుంచి నడవటం కష్టంగా మారిందని ట్రేడ్ టాక్. ఓ మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనుకుని, త‌ను మ‌ళ్లీ ట్రాకులో రావ‌డం తథ్యం అనుకుని చేసిన ఈ సినిమాకు కలెక్షన్స్ సోసోగా ఉన్నాయి.

వాస్తవానికి క్రితం శుక్రవారం పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనపడలేదు. ఆక్యుపెన్సీ జస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదనే చెప్పాలి మంచి రోజులు వచ్చాయితో ఆ మధ్య ఫ్లాప్ చవిచూసిన మారుతీకి ఇప్పుడీ పక్కా కమర్షియల్ కూడా వర్కవుట్ కానట్లే కనిపిస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి థియేట్రికల్ బిజినెస్ జరిగింది 16 కోట్లకు. ఇప్పుడీ టాక్ తో అంత మొత్తం రాబట్టడం కష్టం. పక్కా కమర్షియల్ చిత్రం రాబోయే రోజుల్లో ఏదో మేజిక్ చేసేస్తుందని అయితే ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయటం లేదు. అన్ని ఏరియాలతో పోల్చుకుంటే నైజామ్ లో అత్యధికంగా వసూలు చేస్తోంది. ఆన్ లైన్ టికెట్ సేల్స్ యావరేజ్ గానే ఉండగా….ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఈవినింగ్స్ ఫరవాలేదనిపిస్తున్నాయి. అయితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ఉండటం మాత్రం ఆందోళన కలిగిస్తున్న అంశమే. దాంతో బ్రేక్ ఈవెన్ కష్టం అంటున్నారు. 

 ఇదంతా ఇలా ఉంటే యూనిట్ మాత్రం తమ సినిమా హిట్టయినట్టు ప్రకటించుకుంది. ఈ 3 రోజుల్లో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు కూడా ప్రకటించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ సినిమాకు 15 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ వసూళ్లతో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు ప్రకటించుకున్నారు జీఏ2, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. మరోవైపు ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9 కోట్ల రూపాయలు రావాల్సి ఉందంటున్నారు. ఏది నిజమో..ఏది కేవలం పబ్లిసిటీనో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.