Ante Sundaraniki:ఆలోచనలో నాని, ఆ సీన్స్ ట్రిమ్ చేయాలని ఫిక్స్?

 రిలీజ్ అయ్యాక  అంద‌రినోటా ఒక‌టే మాట‌. అదే.. ర‌న్ టైమ్ పెరిగి పోయింద‌ని. `సినిమా  కాస్త క‌ట్ చేస్తే ఇంకాస్త స్పీడుగా ఉండేది..` అని రివ్యూలలోనూ వచ్చింది. మరో ప్రక్క కలెక్షన్స్ సైతం అనుకున్న స్దాయిలో లేవు. నాని గత చిత్రాలని టచ్ చేయటం లేదు. దాంతో . 

is Ante Sundaraniki Makers to trim the runtime


సినిమా రన్ టైమ్ అనేది సక్సెస్ లో కీలకం అయ్యిపోయింది. కొన్ని సినిమాలకు రన్ టైమ్ కాస్త ఎక్కువ ఉన్నా నడిచిపోతోంది కానీ చాలా సినిమాలకు అదే సమస్యగా మారిపోతోంది. మూడు గంటలు రన్ టైమ్ అంటే థియోటర్ కు వెళ్లటానికే భయపడిపోతున్నారు. అంత సేపు కూర్చోవాలా అని ఈ జనరేషన్ కుర్రాళ్లు  అంటున్నారు. అంటే సుంద‌రానికీ చిత్రం మొన్న  శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు మార్నింగ్ షోకే  డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఓ నలభై నిముషాలు ట్రిమ్ చేస్తే వర్కవుట్ అయ్యే అయ్యేదని అంటున్నారు.

ఈ సినిమా రన్ టైమ్  దాదాపు 3 గంట‌లు.  రిలీజ్ కు ముందు కూడా చిత్ర‌బృందంలో నిడివి గురించిన డిస్క‌ర్షన్  వచ్చింది.  ఎడిట్ చేస్తే బాగుంటుందని కొందరు అంటే అలా చేస్తే ఎమోషన్స్ తగ్గిపోతాయని మరికొందరు వాదించుకుని చివరకు సినిమాకి కత్తెరలు వేయకుండా మూడు గంటల పాటు ఉండేలాగా విడుదల చేశారు. రిలీజ్ అయ్యాక  అంద‌రినోటా ఒక‌టే మాట‌. అదే.. ర‌న్ టైమ్ పెరిగి పోయింద‌ని. `సినిమా  కాస్త క‌ట్ చేస్తే ఇంకాస్త స్పీడుగా ఉండేది..` అని రివ్యూలలోనూ వచ్చింది. మరో ప్రక్క కలెక్షన్స్ సైతం అనుకున్న స్దాయిలో లేవు. నాని గత చిత్రాలని టచ్ చేయటం లేదు.

is Ante Sundaraniki Makers to trim the runtime

దాంతో . ఈ విష‌యాన్ని దర్శక,నిర్మాలు  ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. క‌నీసం 30 నిమిషాల ర‌న్ టైమ్ త‌గ్గిస్తే బాగుంటుంద‌ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్‌. అయితే ఇక్కడే అసలు టాస్క్ ఉంది.. సినిమాలో  ఎక్క‌డ కట్టింగ్ లు చేయాలి? అనేది. నాని ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్స్  `త‌గ్గిస్తే బెట‌ర్‌` అని చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఈ విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉందని చెప్పుకుంటున్నారు.

ఈ విషయమై నాని రిలీజ్ కు ముందు మీడియాతో మాట్లాడుతూ.... "వివేక్ ఫోన్ చేశాడు. 2 గంటల 56 నిమిషాలు లాక్ చేస్తున్నానన్నాడు. నేను ఒప్పుకోలేదు. వచ్చి సినిమా చూస్తానని చెప్పాను. పెన్ను, పేపర్ పట్టుకొని వెళ్లాను. ఎక్కడైనా ఓ 10 నిమిషాలు తగ్గిద్దామనే ఆలోచనతో వెళ్లి కూర్చున్నాను. సినిమా అంతా అయిపోయింది. పెన్ను పట్టుకునే అవసరం రాలేదు. నా గత సినిమాలకు సంబంధించి నేను ఎన్నో సీన్లు కట్ చేశాను. కథ డిస్టర్బ్ అవ్వదనుకుంటే, మంచి సీన్లు కూడా లేపేసిన సందర్భాలున్నాయి. కానీ అంటే సుందరానికి సినిమా విషయంలో ఆ పని చేయలేకపోయాను." అన్నారు.
 
అలాగే "గంటన్నర నిడివి ఉన్న సినిమా బోర్ కొడితే అది చాలా పెద్ద రన్ టైమ్ తో వచ్చినట్టు అర్థం. 3 గంటల సినిమా  చూసినప్పుడు బోర్ కొట్టకుండా, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియకపోతే అది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. అంటే సుందరానికి సినిమా ఈ రెండో కేటగిరీలోకి వస్తుంది. సినిమా పెర్ ఫెక్ట్ లెంగ్త్ లో ఉంది." అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios