ILEANA :రవితేజ రికమెండేషన్..సమంత ఇన్సిప్రేషన్ తో డ్యూటీ ఎక్కింది

 
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రవితేజతోనే మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమా కూడా పరాజయమవడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.
 

Ileana special song with Ravi Teja for Ramarao on Duty

పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ క్లిక్ అవ్వటంతో చాలా మంది హీరోయిన్స్...స్పెషల్ సాంగ్స్ వైపు ఆసక్తి చూపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫేడవుట్ అయిన  గోవా భామ ఇలియానా ఐటెం గర్ల్ గా మారనునట్లు తెలుస్తోంది. హిందీలో దుమ్ము రేపుతాను...అంటూ ఇక్కడ  తెలుగు చిత్రాలు బై చెప్పేసి  మరీ బాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందలేదు. ఇక వచ్చిన అరకొర సినిమాలు ఈ భామకు ప్రత్యేకంగా గుర్తింపుని ఇవ్వలేకపోయాయి.

దాంతో కొంతకాలం బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తెగ ఎంజాయ్ చేస్తూ వార్తల్లో ఎక్కింది. అయితే దాని వలన ఉపయోగం లేదని తెలుసుకుంది. ఓ ప్రక్కన వయస్సు అయ్యిపోతోంది.  దాంతో తను గతంలో హీరోయిన్స్ గా చేసిన హీరోలు, డైరక్టర్స్ కు మెసేజ్ లు పెట్టిందిట. వాళ్లలో  వెంటనే స్పందించిన  ఈ భామ రవితేజ హీరోగా నటిస్తున్న '' రామారావు ఆన్ డ్యూటీ '' అనే సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇలియానా - రవితేజ కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చినప్పటికీ '' కిక్ '' అనే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవుడు చేసిన మనుషులు , ఖతర్నాక్ , అక్బర్ అమర్ ఆంటోనీ చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. రవితేజ - ఇలియానా కాంబినేషన్ లో నాలుగు సినిమాలు రాగా ఒక్కటి మాత్రమే సూపర్ హిట్.

దాంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో మాత్రం హీరోయిన్ గా కాదు ఐటెం గర్ల్ గా మారనుందట. ఇలియానా ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని పైగా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ధీమాగా ఉన్నారట. ఇక ఈ భామ అంటే రవితేజకు  ప్రత్యేకమైన అభిమానం దాంతో రవితేజ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రంగం రెడీ అయ్యినట్లు తెలుస్తోంది.

ఇంతకు ముందు బాలయ్య అఖండ సినిమాలో ఇలియానా నటించనుందని ప్రచారం జరిగినా ఎందుకో ఆ సినిమాను ఇలియానా రిజెక్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు రవితేజతో ఐటెం పాటకు ఒకే చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. తమన్నా లాంటి హీరోయిన్స్  ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్స్ నుండి ఓటీటీ వెబ్ సిరీస్ వరకు బిజీగా ఉండడంతో వీరి తరహాలోనే ఇల్లీ బేబీ కూడా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని రామారావుతో ఐటెం గీతానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.  

కొన్ని వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ ప్రత్యేకమైన థ్రిల్లర్ సినిమా కాగా దివ్యన్షా కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం  షూటింగ్ లో ఉన్న ఈ సినిమా కు ప్రొడక్షన్ స్టేజిలోనే మంచి క్రేజ్ వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios