Allu Arjun:అల్లు అర్జున్ ని అడ్డం పెట్టి దిల్ రాజు బాలీవుడ్ స్కెచ్ ?!

హీరోలు మాత్రం అల్లు అర్జున్ సినిమా అంటే డేట్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవన్నీ గమనించిన దిల్ రాజు ఓ భారి స్కెచ్ వేసినట్లు సమాచారం.

Harish Shankar will remake DJ in Bollywood?


పుష్ప సినిమా సూపర్ హిట్ తో అల్లు అర్జున్ పేరు భారతదేశం అంతటా మారు మ్రోగిపోతోంది. ముఖ్యంగా నార్క్ సర్కిల్ లో బన్ని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆయన చేసిన గత సినిమాలకు మంచి డిమాండ్ వచ్చేసింది. ఆ సినిమాలను రీమేక్ లేదా డబ్బింగ్ చేయాలని అక్కడ నిర్మాతలు ఊగిపోతున్నారు. డబ్బింగ్ అయితే మరీ లాభం. అయితే హీరోలు మాత్రం అల్లు అర్జున్ సినిమా అంటే డేట్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవన్నీ గమనించిన దిల్ రాజు ఓ భారి స్కెచ్ వేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ తో తాను చేసిన డీజే...దువ్వాడ జగన్నాథం సినిమాని బాలీవుడ్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసారట. ఆల్రెడీ అక్కడ ఓ యంగ్ హీరోకు ఈ సినిమా చూపించారని అంటున్నారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు జెర్సీ హిందీ హీరో షాహిద్ కపూర్ అని ఓ వార్త. మరి డైరక్టర్ అంటారా హరీష్ శంకర్ అని చెప్తున్నారు. హరీష్ శంకర్ కు హిందీ సినిమాలపైనా మంచి గ్రిప్ ఉంది. తెలుగులో తనే చేసాడు. కాబట్టి హిందీలోనూ తనే మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయాలని ముచ్చడపడుతున్నారని మీడియా అంటోంది. హరీష్ శంకర్ అందుకు సమర్దుడే కాబట్టి విచిత్రం..విశేషం కూడా లేదంటున్నారు.

ఈ క్రమంలో  హరీష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారని, త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది దర్శకులు హిందీలో సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, వి.వి.వినాయక్ ఇలా చాలా మంది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఓ రీమేక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవ్వటం ఖాయం అంటున్నారు.

మరో ప్రక్క గత రెండేళ్లుగా హరీష్ శంకర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ తో  ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు హరీష్. పవన్ కి ఉన్న వేరే కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా లేటు అవుతూ వస్తోంది. ఈ బ్రేక్ ను ఇతర స్క్రిప్ట్స్ కోసం వినియోగిస్తున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. దిల్ రాజుతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు.  సి. చంద్ర మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios