Pakka Commercial: ‘పక్కా కమర్షియల్‌’ రెండు ఓటిటిల్లో ... డిటేల్స్

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఓటిటి డీల్ ఖరారు అయ్యినట్లు సమాచారం.

 Gopichand Pakka Commercial Seals Two OTT Platforms


గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత  సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.  ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఓటిటి డీల్ ఖరారు అయ్యినట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ఆహా, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. రెండు ఓటిటిల్లోనూ ఒకే రోజు డిజిటిల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. రిలీజైన ఐదు వారాల తర్వాత ఈ సినిమాలో ఓటిటి లో వస్తుంది. 

ఇకపోతే ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్‌ ఉన్న సినిమా చేశానని ఇటీవల గోపీచంద్‌ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘పక్కా కమర్షియల్‌’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్‌ ఉందని, మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అటు రాశీ ఖన్నా సైతం ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో చేసిన ఏంజెల్‌ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుందని తెలిపింది. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు వినికిడి. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ అఫీషియల్ గా  తెలియజేయనున్నారు.

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. 

గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios