యంగ్  హీరోలు అంతా క్లాస్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే గోపీచంద్ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గోపిచంద్ తనను పూర్తి స్దాయి మాస్ హీరోగా చూపించి హిట్ కొట్టే డైరక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. 

మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గోపీచంద్. అయితే గత కొన్నేళ్ళుగా హిట్ అనేది లేదు. ఎలాగైనా కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన సీటీమార్ సినిమా కాస్త ఫరవాలేదనిపించింది. ఇటీవల హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ గోపీచంద్ సినిమాలకు బాగా పలుకుతున్నాయి. పైగా మాస్ చిత్రాలు చేసే మీడియం హీరోలు ఎవ్వరూ అంతగా కనిపించడం లేదు. యంగ్ హీరోలు అంతా క్లాస్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే గోపీచంద్ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గోపిచంద్ తనను పూర్తి స్దాయి మాస్ హీరోగా చూపించి హిట్ కొట్టే డైరక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం.

ఆ డైరక్టర్ మరెవరో కాదు హరి. సింగం సిరీస్‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు హ‌రి. మాస్‌, యాక్ష‌న్ క‌థ‌ల‌కు ఆయ‌న కేరాఫ్ ఎడ్రస్. ముఖ్యంగా పోలీస్ క‌థ‌లు. సింగం, సింగం 2, సింగం 3… త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సాథించాయి. ఈ క్రమంలో గోపీచంద్ కోసం ఇప్పుడు హ‌రి ఓ క‌థ త‌యారు చేశాడ‌ని, అది ఈ హీరోకు అయితే బాగుంటుంద‌ని అనుకుని కలిసారని సమాచారం. ఇప్పటికే ఈ క‌థ విష‌య‌మై.. గోపీచంద్ తో సంప్ర‌దింపులు కూడా మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. గోపీచంద్ కూడా హ‌రితో సినిమా చేయ‌డానికి రెడీగానే ఉన్నాడ‌ని వినికిడి. ఇది కూడా పోలీస్‌ కథ అనే అని తెలుస్తోంది. సింగం తరహాలో స్పీడుగా పరుగెత్తే స్క్రీన్ ప్లేతో హరి రెడీ చేసారట. 

 గోపీచంద్ న‌టించిన‌ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. గోపీచంద్‌తో ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్‌లో ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌. మారుతి డైరెక్షన్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్‌, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఈలెక్కన చూస్తుంటే గోపీచంద్ కు మాస్ సినిమాల కోసం డిమాండ్ బాగానే వున్నట్లు కనిపిస్తోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటిల్ అమౌంట్లు చాలావరకు ఖర్చుకవర్ చేస్తుండడంతో నిర్మాతలు ఇటు చూస్తున్నట్లు అర్దమవుతోంది.