Chiru 154 :సుమంత్ దెబ్బ ...చిరు చిత్రం టైటిల్ మార్పు?
కాకపోతే ఈ టైటిల్ కూడా ఫైనల్ కాకపోవచ్చు అంటున్నారు. వేరే టైటిల్ చూడమని , తన ఇమేజ్ కు తగినట్లుగా కథను లీడ్ చేసేలా ఉండాలని కోరారట. ఈ మేరకు చిరంజీవి ఎదురుగా మూడు టైటిల్స్ ఫైనలైజే చేసి పెట్టారని, త్వరలోనే ఈ కొత్త టైటిల్‌ను ఓ అదిరిపోయే పోస్టర్‌తో ప్రకటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. . ఆ మధ్యన చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఊర మాస్ గెటప్ ని రివీల్ చేసారు. అయితే అప్పుడే టైటిల్ కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కాకపోతే టైటిల్ పట్ల తీవ్ర తర్జన భర్జన పడ్డారు దాంతో గెటప్ మాత్రమే విడుదల చేసారు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ ను మారుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సుమంత్ కొత్త చిత్రం టైటిల్ ‘వాల్తేర్ శీను’అని పెట్టడమే అంటున్నారు.
అయితే మరో ప్రక్క ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య కాకుండా `వాల్తేరు మొనగాడు` అనే టైటిల్ ఇంకా బెటర్‌గా ఉందని బాబీ భావించారట. చిరంజీవికి సైతం ఆ టైటిల్ నచ్చడంతో.. `వాల్తేరు మొనగాడు`నే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ టైటిల్ కూడా ఫైనల్ కాకపోవచ్చు అంటున్నారు. వేరే టైటిల్ చూడమని , తన ఇమేజ్ కు తగినట్లుగా కథను లీడ్ చేసేలా ఉండాలని కోరారట. ఈ మేరకు చిరంజీవి ఎదురుగా మూడు టైటిల్స్ ఫైనలైజే చేసి పెట్టారని, త్వరలోనే ఈ కొత్త టైటిల్‌ను ఓ అదిరిపోయే పోస్టర్‌తో ప్రకటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బాబీ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన కథ చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాది గ్రాండ్‌గా ఈ ఇప్పటికే మూవీ ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా ఊరమాస్ గెటప్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
బాబీ చిత్రం తర్వాత చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడు. డివివి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇటీవలె అధికారిక ప్రకటన వచ్చింది.