Godfather:చిరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారా?మార్పులు అవసరసమా?
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రం.. తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
సీనియర్ హీరో చిరంజీవి.. యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడనే ఆనందాన్ని ఆచార్య చల్లార్చేసింది. ఆచార్య ఫెయిల్యూర్ తో కాస్త కథలు, డైరక్టర్స్ మీద, తన తొందర మీద కాస్తంత వెనక్కి చూసుకోవాలనుకున్నారు. స్క్రిప్టు బాగా వస్తేనే కానీ సినిమా పట్టాలెక్కించకూడదు. సినిమా బాగా వస్తేనే కానీ రిలీజ్ కు వెళ్లకూడదు. రిపేర్లు, రీషూట్స్ అవసరమైతే చేద్దాము కానీ రిలీజ్ అయ్యాక ఎందుకు కనెక్ట్ చేయలేకపోయామనే నానా రాద్దాంతాలు అనవసరమనే నిర్ణయానికి చిరు వచ్చినట్లుసమాచారచం. అలాగని తన జోరు ఏ మాత్రం తగ్గించటం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేయడమే కాకుండా వెంటవెంటనే వాటి షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు.
చిరు ధైర్యం ఏమిటిటంటే... ఆయన నటిస్తున్న చిత్రాల్లో చాలావరకు రీమేక్‌లే. కాబట్టి డైరక్టర్స్ సరిగ్గా వాటిని ప్రెజెంట్ చేస్తే చాలు. తెలుగు నేటివిటిని అద్దితే చాలు. దాంతో ఆయన అనుభవంతో తన డైరక్టర్స్ కథలో మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రం.. తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
మొదట 'గాడ్ ఫాదర్' సినిమాని ముందుగా ఆగస్ట్ 12న విడుదల చేయాలని నిర్ణయించింది మూవీ టీమ్. అయితే 'ఆచార్య' ఫెయిల్యూర్ ని దృష్టిలో పెట్టుకుని... సినిమాలో కొన్ని మార్పులు చేయాలని భావించారట. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లొచ్చిన చిరంజీవి.. మళ్లీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతూనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దాంతో కొన్ని సీన్స్ కు మార్పులు, చేర్పులు చేయిస్తున్నారని వినికిడి. కాకపోతే అవుట్ ఫుట్ అద్బుతంగా వచ్చిందని, కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలోనే చిరు ...డైలమోలో ఉన్నట్లు చెప్తున్నారు.
ఎందుకంటే లూసీఫర్ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా. మధ్యలో మొహమాటానికో,ప్యాన్స్ కోసమే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపితే తేడా కొడుతుందనే భయం. అలాగని యాజటీజ్ వెళ్ళిపోతే తన నుంచి ఆశించే ఎలిమెంట్స్ మిస్సవుతాయనే ఆందోళన చిరంజివికు ఉంది. దాంతో కాస్త మేధో మధనం చేసి,అవసరమైతే మార్పులు చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలవ్వకపోవడంతో ఇవన్నీ పూర్తి చేసి, సెప్టంబర్ 30న గాడ్ ఫాదర్ విడుదల ఉండబోతుందని టాక్. ఇక మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న 'భోళా శంకర్' కూడా జూన్ 21 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.