RC15 Movie: బడ్జెట్ మొత్తం సింగిల్ డీల్ తో ఖతం
అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఆ లెక్కలు మొత్తం సింగిల్ డీల్ తో సెట్ అయ్యిపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తో సెటిల్ చేసుకున్నట్లు వినిపిస్తోంది
'ఆర్ఆర్ఆర్'(RRR Movie) సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు శంకర్(Shankar) దర్శకత్వంలో తన 15వ(RC15) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(kiara Advani) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేశారు. పూనే, సతారా, పాల్‌టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్‌లో షూట్ చేసారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అలాగే శంకర్ తో సినిమా అంటే చాలా వరకు నిర్మాతల్లో లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉంటాయి. అయితే దిల్ రాజు కూడా ముందుగానే ఆలోచించి శంకర్ తో సినిమా చేయడానికి రకరకాల లెక్కలు వేసి ఓకే చేసారు. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఆ లెక్కలు మొత్తం సింగిల్ డీల్ తో సెట్ అయ్యిపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తో సెటిల్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తం దాదాపు 350 కోట్లకు అమ్ముడైనట్లు చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే RC 15 పాన్ ఇండియన్ మార్కెట్ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 15న ప్రారంభించారు. ఇక్కడ చరణ్, కియారా అద్వాని కాంబోలో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం ఇక్కడ భారీ సెట్ వేయిస్తున్నారట. అంటే ఆ సెట్ కోసం దాదాపు రూ. 40 కోట్లను కేటాయించినట్లుగా టాక్.
ఇక మూవీలో సరికొత్త పాత్రలో Ram Charanను శంకర్ సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయబోతున్నారు. ఇటు ప్రేక్షకులను, అటు మెగాభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోకలిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటించిన తర్వాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న చిత్రమిది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 15వ సినిమా ఇది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కూడా ఇదే కావడం విశేషం. తన బ్యానర్‌లో మరే సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో ఇండియన్ సినిమాల్లోనే ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సారథ్యం వహిస్తున్నారు.
also read: RRR Update: `ఆర్‌ఆర్‌ఆర్` మూడో పాట రెడీ.. `జనని` వచ్చేది ఎప్పుడంటే?