Prabhas: ఆ విషయంలో 'ఆదిపురుష్'..ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది!
భారతీయ పురాణాలలో అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
భారతీయ పురాణాలలో అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్ట్రైట్ మూవీగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని అయిదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీకు సంభందించిన గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ మైథాలజీ ఫిల్మ్‌లో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. అయితే మొన్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూసాక..బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల వీఎఫ్ ఎక్స్ వర్క్ లపై ప్రభాస్ అభిమానులకు నమ్మకం సన్నగిల్లింది. అందులో VFX చాలా చీప్ గా లేజర్ షోలాగ ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. ఆదిపురుష్ ప్రత్యేకంగా VFX పై ఆధారపడి చేస్తున్న చిత్రం. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభాస్ ఇమేజ్ ని దెబ్బకొడుతుంది. చాలా ట్రోలింగ్ ఎదురౌతుంది. మొన్నే రాధేశ్యామ్ లో క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ వర్క్ చాలా దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు.
ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన ఓ ఎపిసోడ్ షూట్ చేసారట. ఈ ఎపిసోడ్ లో సీత చిన్నప్పటి జీవితాన్ని, రాముడితో పెళ్లి వరకూ సీత జీవితంలో జరిగిన విషయాలని చూపించబోతున్నారట. సీత జీవితం గురించి చెప్పాలంటే ఆమె కుటుంబం గురించి కూడా చూపించాలి కాబట్టి.. తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని తెరపై చూపించడానికి ఓం రౌత్ రెడీ అయ్యాడు. సీత పాత్రకి కృతి ఎలాగో ఉంది, ఇక కావాల్సింది జనకమహారాజు పాత్ర ప్లే చేయాల్సిన ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్ట్ కోసం ఓం రౌత్ చాలా సెర్చ్ చేయగా, లాస్ట్‌కి అందరికన్నా కృష్ణంరాజు అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటాడని ఫిక్స్ అయ్యాడట ఓం రౌత్. మిథిలాధిపతి జనకుడిగా మన రెబల్ స్టార్ కనిపించనున్నారు.
అయితే రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా, అదే సమయంలో వీరిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమాలు డిజాస్టర్స్ అవుతాయనే సెంటిమెంట్‌కు ఫ్యాన్స్ భయపడుతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ‘బిల్లా’ (Billa), ‘రెబల్’ (Rebel), ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈసారైనా ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదనే చెప్పాలి.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలలో బాలీవుడ్ స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్' ఒకటి. ఇందులో ఆయన రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓంరౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు 'ఆదిపురుష్' చిత్రాన్ని 3డిలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.