Rajamouli: ఇదెక్కడి గొడవ... 'బ్రహ్మాస్త్ర' కు రాజమౌళి సమస్యగా మారారా?

 బ్రహ్మాస్త్రం కోసం పోరాటం, దుష్టశక్తుల యుద్దం.. అద్భుతమైన లవ్‌స్టోరీ..ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్‌లో చూపించారు.  

Brahmastra Trailer VFX Below-par Experience

ర‌ణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్  హీరోయిన్ గా , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న సినిమా ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ ని ఓ వర్గం అద్బుతం, ఇలాంటి విజువల్స్ కేవలం హాలీవుడ్ చిత్రాల్లోనే కనిపిస్తుందంటూ ఓ రేంజిలో లేపారు. అయితే అదే సమయంలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పై సోషల్ మీడియాలో దారుణ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి సమర్పిస్తున్నాడు కానీ ఆయనే ఈ సినిమా కు సమస్యగా మారుతున్నాడంటున్నారు.

రాజమౌళి బాహుబలి సినిమాలోని  విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని పోలుస్తున్నారు. రాజమౌళి ఇచ్చే విఎఫ్ ఎక్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండియాలో ఇంకెవ్వరూ ఇవ్వలేరన్నది ఈ ట్రైలర్ తో స్పష్టం అయ్యిందంటున్నారు. వీఎఫెక్స్ అంటే సినిమాలో ఎలా కలసిపోవాలి. ప్రేక్షకుడుకి ఎలాంటి ఎక్సపీరియన్స్ ఇవ్వాలి  అనే విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు రాజమౌళి అనటంలో సందేహం లేదు. ఇప్పుడు  ఆ ప్రమాణాలను అందుకోవడం బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలకు బాగా  కష్టం అయిపోతోంది.

 ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూసి అందరూ పెదవి విరుస్తుండటానికి పరోక్షంగా ‘బాహుబలి’నే కారణం అని తేలేస్తున్నారు. బాహుబలిని దాటే  అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే తప్ప నచ్చవంటున్నారు. దాంతో ఈ విజువల్స్ చూసి.. ఇవి చూసేసరికి మామూలుగా అనిపిస్తున్నాయి.  బిలో పార్ అంటున్నారు.ఇది ఖచ్చితంగా టీమ్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే అంశంగా మారింది. రాజమౌళి హై స్టాండర్డ్స్ సెట్ చేయటం వల్లే ఇలా జరుగుతోందని వాపోతున్నారట.
 
'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర టీమ్ చెబుతూ వస్తోంది.  ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ప్లాన్ చేసారని అర్థం అవుతోంది. అంటే విజువల్స్ అద్బుతంగా ఉండాలి. 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ''నీరు, నిప్పు, వాయువు ప్రాచీన కాలంలో మన మధ్య ఉన్న శక్తులు. అస్త్రాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ కథ సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర' గురించి'' అని అమితాబ్ బచ్చన్ వివరించారు. అప్పుడు వచ్చే విజువల్స్ అబ్బురపరిచేలా ఉండాలి ..కానీ మామూలుగా ఉన్నాయి.

‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకునికే తెలియదు. అతనే శివా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌ గంభీరంగా ఉంది. బ్రహ్మాస్త్రం కోసం పోరాటం, దుష్టశక్తుల యుద్దం.. అద్భుతమైన లవ్‌స్టోరీ..ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్‌లో చూపించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ  ప్రతిష్టాత్మమైన  సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న  హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios