Boyapati srinu: బోయపాటి శ్రీను నెక్ట్స్..బోల్తా పడతాడా? ఈ జ్యోతిష్యాలేంటి?

బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాలన్నా కూడా ఆచి,తూచి అడుగులు వేస్తారు మిగతా హీరోలు, మహేష్, పవన్ వంటి హీరోలు అయితే దూరం పెట్టేసారు. ఈ నేపధ్ంయలో బోయపాటికు బాలయ్య, అల్లు అర్జున్ మాత్రమే ఆప్షన్స్ గా కనపడుతున్నారు.

Boyapati srinu next movie with hero ram danger?


 "అఖండ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ చేసే హీరో ఎవరనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి యాక్షన్ కథలకు అందరు హీరోలు నప్పరు. దాంతో బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాలన్నా కూడా ఆచి,తూచి అడుగులు వేస్తారు మిగతా హీరోలు, మహేష్, పవన్ వంటి హీరోలు అయితే దూరం పెట్టేసారు. ఈ నేపధ్ంయలో బోయపాటికు బాలయ్య, అల్లు అర్జున్ మాత్రమే ఆప్షన్స్ గా కనపడుతున్నారు. అయితే ఇప్పుడు మరో హీరో సీన్ లోకి వచ్చారు. ఆ హీరో మరెవరో కాదు రామ్. అల్లు అర్జున్ పుష్ప 2 ఫినిష్ చేసుకుని వచ్చేసరికి చాలా టైమ్ పట్టేటట్లు ఉందని బోయపాటి రామ్ తో మొదలు పెట్టబోతున్నారట. అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే రాలేదు కానీ ...మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.  ఈ నేపధ్యంలో మధ్యలో రామ్ తో సినిమా చేస్తే బోల్తాపడతారంటూ మీడియా లో కొందరు జ్యోతిష్యం చెప్పటం మొదలెట్టేసారు. కథనాలు రాసేస్తున్నారు.

రామ్ తో తన తదుపరి ఒక సినిమా చేయబోతున్నారు. ఇక బన్నీ - బోయపాటి ల కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు అల్లు అర్జున్ మాత్రం పుష్ప షూటింగ్ పూర్తయ్యే వరకు షూటింగ్ మొదలు పెట్టాలని ఆసక్తి చూపించడం లేదట.
 
వాళ్లు చెప్పేదాని ప్రకారం...రామ్‌ తో సినిమాను సింపుల్‌ అండ్‌ స్పీడ్ గా చేయాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు. యాక్షన్ సినిమానే కానీ అది  ప్రయోగంట. ఈ సినిమా కనుక వినయ విధేయ రామ సినిమా తరహా లో విఫలం అయితే అప్పుడు అల్లు అర్జున్‌ నుండి బోయపాటికి పెద్ద షాక్ తప్పక పోవచ్చు అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ మరియు బోయపాటిల కాంబో సినిమాపై నీలి నీడలు కమ్ముకునే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. కనుక రామ్‌ తో తీయబోతున్న సినిమా నూటికి నూరు శాతం సక్సెస్‌ అవుతుంది అనే నమ్మకం ఉంటేనే బోయపాటి ఆ సినిమాను తీస్తే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ తో సినిమా మిస్ చేసుకుంటే అంతకు మించి దురదృష్టం ఉండదని ముందుకు సూచలను చేస్తున్నారు. అదండీ విషయం.

ఇక అల్లు అర్జున్‌ తో సరైనోడు సినిమా ను తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్ ను దక్కించుకున్న బోయపాటి శ్రీను ఊహించని విధంగా రామ్‌ చరణ్ తో సినిమా చేసే అవకాశం ను దక్కించుకున్నాడు. రామ్‌ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించిన బోయపాటి అది డిజాస్టర్ అవటంతో బొక్క బోర్లా పడ్డాడు. రామ్‌ చరణ్ ను సోషల్‌ మీడియాలో జనాలు ఒక ఆట ఆడుకునేలా చేసిందా సినిమా. రామ్‌ చరణ్ తల ఎత్తుకోలేకుండా కొన్ని సన్నివేశాలను ఆ సినిమా లో రామ్‌ చరణ్ తో చేసి బోయపాటి పరువు తీశాడు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి బోయపాటికు అల్లు అర్జున్, బాలయ్య ఫెరఫెక్ట్ అన్నమాట అనే ప్రచారం ఇందుకే జరుగుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios