Chiranjeevi:ఈ లుక్ కు ఎవరు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారంటే....

ఈ స్టార్స్ ఇద్దరూ  చాలా కాలం పాటు సమకాలీనులుగా ఉన్నందున పోలికలు స్పష్టంగా హైలెట్ అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా లో ఇద్దరి ఫొటోలు ప్రక్కనే పెట్టి వీళ్లలో ఎవరు బాగున్నారనే పోల్ మొదలైంది. 

Both Balayya, Chiranjeevi are sporting a salt and pepper look

చాలా కాలం నుంచి బాలకృష్ణ-చిరంజీవిల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉంటూనే వస్తోంది. సోషల్ మీడియా వచ్చాక ఇది మరీ  ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇద్దరూ పోటా పోటీగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో  ఇప్పుడు, బాలకృష్ణ, చిరంజీవి మధ్య పోటీ మరో సారి హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు స్టార్స్  తమ కొత్త సినిమాలు  NBK107, గాడ్‌ఫాదర్‌ల ఫస్ట్‌లుక్‌లను ఆవిష్కరించారు. ఇద్దరుస్టార్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా మాస్ సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి. 

ఈ స్టార్స్ ఇద్దరూ  చాలా కాలం పాటు సమకాలీనులుగా ఉన్నందున పోలికలు స్పష్టంగా హైలెట్ అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా లో ఇద్దరి ఫొటోలు ప్రక్కనే పెట్టి వీళ్లలో ఎవరు బాగున్నారనే పోల్ మొదలైంది. అక్కడి టాక్ ప్రకారం బాలకృష్ణ లుక్స్ పరంగా చిరంజీవిని పూర్తిగా దాటేసాడు. ఈ లుక్  విషయానికి వస్తే చిరు కాస్త వెనకబడ్డాడనే అంటున్నారు. అందులోనూ మాస్ జాతర చేయటంలో  NBK తీరేవేరు అని నెటిజన్లు అంటున్నారు. 

NBK107లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో NBK కాస్త క్రూరంగా కనిపించినా   పోల్చి చూస్తే , గాడ్‌ఫాదర్‌లో చిరు లుక్ కాస్త తక్కువగానే ఉందంటున్నారు. అయితే ఓ వర్గం మాత్రం చిరంజీవే దుమ్ము రేపాటంటున్నారు. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో చిరు కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసిందని మురిసిపోతున్నారు. ఏదైమైనా చిరంజీవి ఆచార్య కంటే బావున్నాడు. 

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల `ఆచార్య` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేక ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `గాడ్ ఫాదర్`. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన `లూసీఫర్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నయనతార సత్యదేవ్ పూరి జగన్నాథ్ సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios