Ram Pothineni:రామ్ సినిమాపై వైరల్ వార్త, నమ్మచ్చా? కష్టమే

 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. 

Balakrishna reference in Ram Next?


నందమూరి అభిమానుల్లో  బాలయ్య అన్న పదం వింటే బాడీలో వైబ్రేషన్స్ మొదలైపోతాయి.  ముఖ్యంగా బోయపాటి, బాలయ్య కాంబో అంటే మరీను. మొన్న అఖండ హై సక్సెస్ తో అది మరో సారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయకపోయినా ... ఆయన పేరుని,క్రేజ్ ని వాడాలని బోయపాటి ఫిక్స్ అయ్యారని వినపడుతోంది. అటు బాలయ్యని, ఇటు ఆయన అభిమానుల్ని వీలైనంత వరకూ తన తాజా  సినిమాకు ఉపయిగించుకోవాలి అని బోయపాటి స్కెచ్ వేసాడని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. బోయపాటి ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్నారు. 

బాలయ్యకు  ఓ వీరాభిమాని పాత్ర‌లో రామ్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నారని టాక్‌.  బాల‌య్య రెఫ‌రెన్సులుండేలా భారీ సీన్‌ను ప్లాన్ చేశార‌ంటున్నారు.  బాలయ్యతో వర్క్ చేసి ఆయన మేనరింజలు బాగా పట్టుకున్న బోయపాటి అవే మరో సారి ప్లే చేయబోతున్నారట. అచ్చం బాలయ్యను తెరపై చూసినట్లు ఉండేలా అవి ఉంటాయంటున్నారు.ఈ వార్త బయిటకు రాగానే జై బాల‌య్య అంటూ ఆయ‌న ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.  అయితే ఇది పులిహార వార్త అని, అలాంటిదేమీ లేదని ఓ వర్గం అంటున్నారు. బోయపాటి సినిమా కదా అని వండేసిన రూమర్ అని చెప్తున్నారు.  గతంలో నాని హీరోగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’లోనూ హీరోని  అనంతపురం బాలయ్య అభిమానిగా చూపించారు. అందులో నాని ..తన చేతిలో బాలయ్య పేరు టట్టూ వేసుకుని కనపడతారు.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది. 'ది వారియర్' తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది.
 
నిర్మాత  శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios