'అఖండ' .. లెక్క 2.37, వర్షాలని అక్కడ వద్దనుకున్నారట
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. దీనికి అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు..
బాలకృష్ణ హీరోగా బోయపాటి 'అఖండ' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ కలిగిన పాత్రలను పోషించగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈచిత్రం రన్ టైమ్ ఎంత అనేది బయిటకు వచ్చింది.
ఈ సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువే అని సమాచారం. 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశాడట బోయపాటి. బాలయ్యతో ఇంతకుముందు బోయపాటి రూపొందించిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్’ సైతం అటు ఇటుగా ఈ నిడివితో రిలీజైన చిత్రాలే. ‘సింహా’ రన్ టైం 2 గంటల 36 నిమిషాలు కాగా.. ‘లెజెండ్’ 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్సే దాదాపు 45 నిమిషాలు సాగుతాయన్ని యూనిట్ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక రోజులు యాక్షన్ సీన్స్ ను షూట్ చేసిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పినట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Also read వాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టండి... బాబుకు సంఘీభావంగా బాలయ్య ఫ్యాన్స్ పిలిపు!
రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గాని వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భారీ వర్షాలతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.
Also read బాలయ్య 'అన్ స్టాపబుల్'లో రోజా.. అసలు సిసలైన మజా, ఆ టాపిక్ మాట్లాడుకుంటారా
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. మరో కీలకమైన పాత్రను జగపతిబాబు పోషించాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మొదలైన దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్ లాంచ్ అయ్యాక అంచనాలు మరింత పెంచేసింది.