Tollywood:ఈ ఇద్దరు టాలీవుడ్ పెద్దలపై జగన్ ప్రెజర్ పనిచేయ లేదా?

జగన్ తో జరిగిన ఈ మీటింగ్ విషయాలకు దూరంగా ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు.  వారిని ఇప్పుడు ఓ వర్గం మీడియా హైలెట్ చేస్తోంది. వారు జగన్ ప్రెజర్ కు లొంగలేదని అంటన్నారు. ఎవరు వాళ్లు ...

AP CM Jagan Pressure Did Not Work On these Tollywood biggies


రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో జరిగిన సమావేశంలో టాలీవుడ్ పెద్దలు కీలక ప్రతిపాదనలు పెట్టారు.. ముఖ్యంగా 17 అంశాలను సీఎం ముందు వచ్చారనే సంగతి తెలసిందే.. ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా ఆలోచించి.. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా జగన్ అడిగి తెలుసుకున్నట్టు మీడియాలో వచ్చింది. ఈ సందర్భంగా ప్రస్తుత టికెట్ల రేట్లతో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలసి వస్తోంది.

ఆర్ఆర్ఆర్ (RRR), రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాలు వాయిదాలకు కారణాలను కూడా సీఎం జగన్ కు వారు వివరించినట్టు తెలుస్తోంది.  వారి సమస్యలు అన్నీ విన్న సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా.. సినిమా పరిశ్రమకు ఆర్థిక నష్టాలు తగ్గించేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే జగన్ తో జరిగిన ఈ మీటింగ్ విషయాలకు దూరంగా ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు.  వారిని ఇప్పుడు ఓ వర్గం మీడియా హైలెట్ చేస్తోంది. వారు జగన్ ప్రెజర్ కు లొంగలేదని అంటన్నారు. ఎవరు వాళ్లు ...

ఆ ఇద్దరు పెద్దలు...ఒకరు సురేష్ బాబు, మరొకరు బాలకృష్ణ. ఈ ఇద్దరు టాలీవుడ్ పెద్దలని కూడా సీఎమ్ ఓ మీటింగ్ కు రమ్మనమని పిలిచారని,కానీ వారు ఇగ్నోర్ చేసి సున్నితంగా తప్పుకున్నారంటున్నారు. సురేష్ బాబు కు గవర్నమెంట్ తో మాట్లాడటాలు, బ్రతిమిలాడలారు ఇష్టం లేవని తన పెండింగ్ సినిమాలన్నీ ఓటిటి లో రిలీజ్ చేసుంటామని గతంలో చెప్పారు. అదే మాట మీద ఉన్నారు.

అలాగే అఖండ రిలీజ్ టైమ్ లో టిక్కెట్ల విషయమై వైయస్ జగన్ కు ఓ మాట చెప్పమని నిర్మాత అడిగినా బాలయ్య నో చెప్పారంటున్నారు. మొన్న జరిగిన మీటింగ్ కు చిరంజీవి...స్వయంగా బాలయ్యని ఇన్వైట్ చేసారు ఆయన వేరే పనుల్లో ఉన్నానని తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సురేష్ బాబు కానీ, బాలయ్య కానీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడమని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ లిస్ట్ లో ఉన్నా మీటింగ్ కు రాలేదు, ఆయన అభిప్రాయం చెప్పలేదు. పవన్ కూడా ఈ విషయమై ఏమీ మాట్లాడనని చిరుకు మాట ఇచ్చినట్లు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios