Tollywood :సినీపెద్ద‌ల‌కు జ‌గ‌న్ ఈ కండీషన్స్ పెట్టారా?!

ఈ మీటింగ్  తో సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ పైచేయి సాధించాడని ఓ వర్గం అంటోంది. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు టాలీవుడ్ ను త‌ర‌లించ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేశారని చెప్తున్నారు. 

AP CM Jagan conditions to Tollywood?


 తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యిన సంగతి తెలిసిందే. సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో అక్కడ మీటింగ్ లో ఏం మాట్లాడారు, ఏమన్నా కండీషన్స్ పెట్టారా అనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.
 
ఈ మీటింగ్ లో ..సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే అందరి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ తరచూ సమావేశమై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తనతో పంచుకున్నట్లు తెలిపారు.  

ఈ మీటింగ్  తో సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ పైచేయి సాధించాడని ఓ వర్గం అంటోంది. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు టాలీవుడ్ ను త‌ర‌లించ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేశారని చెప్తున్నారు. జీవో నెంబ‌ర్ 35 సవ‌ర‌ణ‌కు, సినిమా ఇండ‌స్ట్రీని త‌ర‌లించ‌డానికి లింకేశాడని గుసగసలు ఆడుతున్నారు. సినిమా షూటింగ్ ల‌ను ఏపీలోనూ జ‌ర‌పాల‌ని కండిష‌న్ పెట్టడం జరిగిందిట. విశాఖ న‌గ‌రానికి స్టూడియోల‌ను త‌ర‌లించ‌డానికి అనువుగా ఉండే అంశాల‌ను చిరంజీవి అండ్ టీం ముందు ఉంచటం జరిగిందిట. అందుకు స్టార్ హీరోలు అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో ఎక్కువ భాగం ఏపీ నుంచి వ‌స్తోందనే విషయం తెలిసిందే. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల నుంచి వ‌చ్చే షేర్ 80శాతం ఉంటుంది. కేవ‌లం 20శాతం మాత్ర‌మే నైజాం నుంచి రాబ‌డి వ‌స్తుంది. హైద‌రాబాద్ మిన‌హా తెలంగాణ‌లోని ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే షేర్ చాల తక్కువ. అత్యంత లాభాల‌నుతెచ్చే ఏపీ రాష్ట్రానికి సినిమా ఇండ‌స్ట్రీ వ‌ల‌న వ‌చ్చే లాభం ఏమీ లేదని జగన్ భావిస్తున్నారట. ఏపీ ప్ర‌జ‌ల సొమ్మును సినిమా వాళ్లు హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల పెట్టుబడులుగా పెడుతున్నారు. స్టూడియోలు, షూటింగ్ లు అన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటున్నాయి.దాంతో  సినిమా ఆదాయం రూపంలో వ‌చ్చే ప‌న్నులు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ జ‌మ అవుతున్నాయి. డ‌బ్బు ఏపీ ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేస్తూ, ఆదాయాన్ని మాత్రం తెలంగాణ‌కు అప్ప‌గిస్తోన్న రంగాల్లో ప్ర‌ముఖంగా సినిమా ఇండ‌స్ట్రీ ఉందనేదే ఇక్కడ కీలకమైన అంశంగా చెప్తున్నారు.  

ఈ నేపధ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టాలీవుడ్ పెద్దలకు కొన్ని కండిష‌న్లు పెట్టాడ‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి ఏ మాత్రం లాభం లేకుండా ప్ర‌జల సొమ్మును తెలంగాణ రాష్ట్రానికి వినోదం రూపంలో తీసుకెళ్ల‌డానికి కుద‌ర‌ద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ ఖచ్చితంగా చెప్పిన‌ట్టు చెప్పుకుంటన్నారు.  మొత్తం మీద టిక్కెట్ల ధ‌ర‌ల పెంపు, ఆన్ లైన్ విక్ర‌య విధానంకు సంబంధించిన జీవోలను స‌వ‌రించాలంటే టాలీవుడ్ విశాఖ‌కు త‌ర‌లిరావాల‌ని జ‌గ‌న్ కండిష‌న్ పెట్టిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల ద్వారా వినికిడి.
 
అదే జగన్ మాటల్లో ...నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా.  నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం.

విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి... అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios