Thank you: దేవుడా... అమేజాన్ ప్రైమ్ కూడా దెబ్బ కొట్టిందే!?

 ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ పొందింది. ఈ సినిమా జీరో షేర్ వరల్డ్ వైడ్ అని తేల్చారు. కలెక్షన్స్ తో వచ్చిన కొద్దో గొప్పో మొత్తం రెంటల్ బేసిస్ మీద లెక్కేస్తే షేర్ ఏమీ మిగలదు అని ట్రేడ్ అంటోంది. అంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.  మిడ్ రేంజ్ హీరోల కంటే థాంక్యూ సినిమాకు తక్కువ వసూళ్లు రావడం దర్శకనిర్మాతలకు , అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. ఇప్పుడు ఓటిటి ఎర్లీ రిలీజ్ విషయంలోనూ దెబ్బ పడిందని తెలుస్తోంది.

Amazon rejects Thank You Early Digital Deal


అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసిన సంగతి తెలసిందే. నాగచైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది.  తన ఎదుగుదలకు కారణమైన వారికి కృత‌జ్ఞ‌త‌ చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల లో విడుదలైన భారీ చిత్రాల్లో థాంక్యూ ఒకటి కావడంతో నాగచైతన్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది. అసలే ప్లాప్ దెబ్బతో విచారంలో ఉన్న దిల్ రాజుకు మరో దెబ్బ తగిలిందని సమాచారం.

సినిమా ఎలాగూ ప్లాఫ్ అయ్యింది కాబట్టి ఎర్లీ ఓటిటి రిలీజ్ ఇద్దామని అనుకున్నారట. అందుకు ఓటిటి సంస్ద ఎగస్ట్రా పే చేస్తుంది. అయితే ఈ రేంజి డిజాస్టర్ సినిమాకు వ్యూస్ రావని, కాబట్టి ఎర్లీ రిలీజ్ కు ఎగస్ట్రా పే చేయమని అమేజాన్ ప్రైమ్ సంస్ద తెగేసి చెప్పిందిట. మరో ప్రక్క ఎర్లీ రిలీజ్ అంటే నిర్మాతల మండలి ఏమంటుందో అనే ఆలోచన కూడా దిల్ రాజు చేస్తున్నారట. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఓటిటి రిలీజ్ లకు ఎంత గ్యాప్ ఇవ్వాలి అనే విషయమై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ రకంగా ఈ సినిమాకు ఓటిటి సంస్ద కూడా హ్యాండ్ ఇచ్చిందని మీడియాలో వినిపిస్తోంది. 
 
ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ పొందింది. ఈ సినిమా జీరో షేర్ వరల్డ్ వైడ్ అని తేల్చారు. కలెక్షన్స్ తో వచ్చిన కొద్దో గొప్పో మొత్తం రెంటల్ బేసిస్ మీద లెక్కేస్తే షేర్ ఏమీ మిగలదు అని ట్రేడ్ అంటోంది. అంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.  మిడ్ రేంజ్ హీరోల కంటే థాంక్యూ సినిమాకు తక్కువ వసూళ్లు రావడం దర్శకనిర్మాతలకు , అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. ఈ సినిమా 24 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.  మౌత్ టాక్ నెగెటివ్ గా ఉండటంతో థాంక్యూ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం అసాధ్యం అంటున్నారు.   

 ఫస్ట్ డే నే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వగా రెండో రోజు మరింత స్లో అయిన సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. సినిమా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు. ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ తో  చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడ్డాయి సినిమాకి.. దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగ‌చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ దిల్‌రాజు సంస్థ‌లో నాగ‌చైత‌న్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios