Allu Arjun:షారూఖ్ తో పూర్తయ్యాక..అల్లు అర్జున్ తొనే..తగ్గేదేలే
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్ సొంతం చేసుకుంది.
'పుష్ప' రాజ్ మేనియా మామూలుగా లేదు. ఈ సినిమా గత నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. దాంతో అందరి డైరక్టర్స్ దృష్టీ అల్లు అర్జున్ పై పడింది. వాళ్ల హిట్ లిస్ట్ లో బన్ని అటోమేటిక్ గా చేరిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం ‘పుష్పరాజ్’పై అమితమైన అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ ఇచ్చిన కిక్‌తో మరో పాన్‌ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఆ క్రమంలోనే తమిళ దర్శకుడు అట్లీ కూడా బన్నీతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రాజా రాణి, తేరీ, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన అట్లీ ఈ మధ్యనే బిగిల్ సినిమాతో మరొక హిట్ కొట్టారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది అని వినిపిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో బన్నీ ఈ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల పారితోషికం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అట్లీ ఇప్పటికే షారూఖ్ తో సినిమా కమిటయ్యి ఉన్నారు. ఆ సినిమా ఫినిష్ చేయాలి.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అట్లీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులతో బిజీగా ఉన్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది లోనే సినిమా రిలీజ్ అవుతుందిట. షారుఖ్ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒకటి ఎన్.ఐ.ఏ. అధికారి కాగా మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా. 2019 నుంచి షారుఖ్ - అట్లీల చిత్రంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే...ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప 2" బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి పట్టలెక్కనుంది.