Balakrishna: బాలయ్యతో అరవింద్ కొత్త స్కెచ్..మాములుగా లేదుగా
బాలయ్యని తొలి సారి హోస్ట్ గా పరిచయం చేసి `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` టాక్ షో తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అరవింద్ బాలయ్యని తో సినిమా నిర్మిస్తూ సర్ ప్రైజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అంటే ఆ లెక్కే వేరు. ఆ బ్యానర్ లో సినిమా అంటే గ్యారెటీ హిట్ అంటారు. అలాగే బాలయ్యతో సినిమా అంటే అఖండతో ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఆ లెక్కే వేరు. అది జరగబోతోందా?
అల్లు అరవింద్ తమ `ఆహా` కోసం నందమూరి బాలకృష్ణనే స్వయంగా రంగంలోకి దింపి హోస్ట్ గా `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` పేరుతో టాక్ షోని స్టార్ట్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైనల్ ఎపిసోడ్ తో ఈ టాక్ షో ఎండ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్యని తొలి సారి హోస్ట్ గా పరిచయం చేసి `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` టాక్ షో తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అరవింద్ బాలయ్యని తో సినిమా నిర్మిస్తూ సర్ ప్రైజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
`అన్ స్టాపబుల్ టాక్ షోతో సక్సెస్ ఫుల్ జోడీగా మారిన బాలయ్య - అల్లు అరవింద్ త్వరలో ఓ భారీ సినిమాని చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ లో మెగా హీరోలని మాత్రమే ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ తొలిసారిగా బాలయ్య తో భారీ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టేసారని చెబుతున్నారు.
అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారని బాలయ్యని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోయే ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అరవింద్ పలు దర్శకులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరపడే స్టోరీ, అలాగే ఆయనని మరింత కొత్తగా ప్రజెంట్ చేయగల దర్శకుడు ఫైనల్ కాగానే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే భాక్సాఫీస్ దగ్గర పూర్తిగా మారిపోతాయనటంలో సందేహం లేదు.