Naga Chaitanya :“దూత” గా నాగచైతన్య ...ఆత్మలతో మాట్లాడతాడా? అదే స్టోరి లైనా
‘దూత’ పేరుతో నాగ చైతన్య వెబ్ సిరీస్ చేయనున్నాడట. ఈ వెబ్ సిరీస్ ఒక హారర్ థ్రిల్లర్. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దీనికి దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
మొన్న బంగార్రాజు చిత్రంలో తన తాత(నాగార్జున)ఆత్మ తనలోకి రావటం..అక్కడ నుంచి జరిగే ఫన్ ,యాక్షన్ చేసాడు నాగచైతన్య. ఆ సినిమా మంచి హిట్టైంది. ఇప్పుడు మరోసారి ఆత్మలతో మాట్లాడే కాన్సెప్ట్ తో చైతూ రాబోతున్నట్లు సమాచారం. చాలా డిఫరెంట్ గా సీన్స్ ఉంటాయని, ఇప్పటిదాకా తెరపై చూడని విధంగా నాగచైతన్య కనిపిస్తాడని అంటున్నారు. ఇంతకీ ఏమిటా మ్యాటర్ చూద్దాం.
నాగచైతన్య త్వరలో డిజిటల్ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీనికి కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ ఒరిజినల్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి “దూత” అనే టైటిల్ పెట్టబోన్నట్లు టాక్ వినిపిస్తోంది. టైటిల్ ని బట్టి ఇందులో చైతన్య ఒక మెసెంజర్ గా కనిపిస్తారని చెప్తున్నారు.అంటే ఆత్మలకు,మనష్యులకు మద్యవర్తిగా ఉంటాడన్నమాట. ఆత్మలతో మాట్లాడి మానవులకు సందేశం ఇచ్చే దూతగా కనిపిస్తారని అంటున్నారు.
అయితే హారర్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు నాగచైతన్య ఆ మధ్య ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో నెగిటివ్ రోల్ అయినా చేయడానికి రెడీ అయినట్లు తెలిపారు. మంచి స్క్రిప్ట్ దొరికినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సినిమా చేద్దామని నిర్మాతలను అడగలేనని.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసులు ఎలాంటి పాత్ర అయినా చేసే అవకాశం అందిస్తోందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. బిగ్ స్క్రీన్ మీద తమకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది యాక్టర్స్ అన్ని రకాల పాత్రల్లో నటించడం లేదని.. కానీ ఇప్పుడు ఓటీటీల వల్ల కుదురుతుందని చెప్పారు.
అలాగే ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ లో నాగచైతన్యతో పాటుగా ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో త్వరలో ఈ ఒరిజినల్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'మనం' సినిమా కల్ట్ క్లాసిక్ తర్వాత..నాగచైతన్య - విక్రమ్ కలిసి చేస్తున్న 'థాంక్యూ' సిరీస్ పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అది వర్కవుట్ అయితే దూత కూడా నెక్ట్స్ లెవిల్ లో జనం ఎక్సపెక్ట్ చేస్తారనటంలో సందేహం లేదు.