Agent:సినిమా మొదట్లోనే ఈ కంగారు పెట్టే వార్తలేంటి అయ్యగారూ?
అయితే కొత్త సంవత్సరం సందర్బంగా కూడా అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న లుక్‌ను చూపించారు గానీ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. కనీసం ఫస్ట్ గ్లింప్స్, టీజర్ లేదా రిలీజ్ డేట్‌కు సంబంధించిన కన్‌ఫర్మేషన్ వస్తుందనుకున్నారు.
రీసెంట్ గా మోస్ట్ 'ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాతో వచ్చి కెరీర్ లో తొలిసారి హిట్ రుచి చూసారు అఖిల్ అక్కినేని. దాంతో ఆ హిట్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం సహజం. ప్రస్తుతం 'ఏజెంట్' మూవీలో నటిస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రత్యకత ఏంటీ అంటే అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అఖిల్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే కొత్త సంవత్సరం సందర్బంగా కూడా అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న లుక్‌ను చూపించారు గానీ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. కనీసం ఫస్ట్ గ్లింప్స్, టీజర్ లేదా రిలీజ్ డేట్‌కు సంబంధించిన కన్‌ఫర్మేషన్ వస్తుందనుకున్నారు. దాంతో అభిమానులు కొందరు 'ఏజెంట్' మూవీ అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసారు. అది ప్రక్కన పెడితే ఇంతకీ ఏజెంట్ చేస్తున్నాడు అంటే...రీషూట్ మోడ్ లో ఉన్నాడంటున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 25% పూర్తయింది. కానీ కొవిడ్ కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పటివరకు చేసిన రషెస్ చూసిన సురేందర్ రెడ్డి మరియు టీమ్ హీరో క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు ఉంటే బాగుంటుందని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" హిట్ అయ్యాక అఖిల్ తీసుకుంటున్న జాగ్రత్తలలో ఇదీ ఒకటి అంటున్నారు. ఇక నుంచి ప్రతీ అడుగు ఆచి తూచి వేయాలని డిసైడ్ అయ్యారట.అయితే సినిమా ప్రారంభంలోనే రీషూట్స్ ఏమిటని అభిమానులు కంగారుపడుతున్నారు. సాధారణంగా సినిమా పూర్తయ్యాక రూషూట్స్ పోగ్రాం ఉంటుంది.
హీరోగా మారిన తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న అక్కినేని అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా తో ఎట్టకేలకు యొక్క మొట్టమొదటి కమర్షియల్ హిట్ అందుకున్నారు. నిజానికి ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లు చూసి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ దసరా సెలవులు వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు,చేర్పులు చేయటం జరిగాయి. మరోవైపు దిల్ రాజు నిర్మించిన "షాదీముబారక్" కథ కూడా ఒకేలా ఉండడంతో చిత్ర దర్శక నిర్మాతలు కొన్ని మార్పులు చేసారని చెప్పుకున్నారు. ఇక ఫైనల్ కాఫీ ఓకే అనిపించుకున్నాక మాత్రమే రిలీజ్ డేట్ ను ఇచ్చి హిట్ కొట్టారు. ఇక అంతదాకా వెళ్లక ముందే ఏజెంట్ జాగ్రత్తలు పడుతున్నాడన్నమాట.