Akhil Agent:'ఏజెంట్‌'.... కమల్ చేసిన ఆ చిత్రం కథలాంటిదే? ట్విస్ట్ అదే

అప్పటిదాకా తనను చంపటానికి ప్రయత్నిస్తున్న వాళ్లు ఎవరో, ఎందుకు చంపాలనుకుంటున్నారో తనెవరో తెలుసుకోవడమే ఈ ట్విస్ట్ అంటున్నారు. ఫస్టాఫ్ అంతా కథ,కథనం పరుగెడుతూనే ఉంటుందని చెప్తున్నారు. 

Agent: Akhil Story line inspired by Kamal Movie?


 అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఏజెంట్‌.  బొమ్మరిల్లు భాస్కర్ తో గత యేడాది చేసిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో మంచి హిట్‌ను అందుకోవటంతో  అఖిల్‌, ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు ఏజెంట్‌ రూపంలో రానున్నాడు. ఇన్నాళ్లూ  లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అఖిల్‌ మేకోవర్‌ చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు.

ఇక ఈ చిత్రంలోని ఇంట్రవెల్ ట్విస్ట్ సినిమా కు హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. ఆ ట్విస్ట్ 'ది బోర్న్‌ ఐడెంటిటీ' లోది అని తెలుస్తోంది. అప్పటిదాకా తనను చంపటానికి ప్రయత్నిస్తున్న వాళ్లు ఎవరో, ఎందుకు చంపాలనుకుంటున్నారో తనెవరో తెలుసుకోవడమే ఈ ట్విస్ట్ అంటున్నారు. ఫస్టాఫ్ అంతా కథ,కథనం పరుగెడుతూనే ఉంటుందని చెప్తున్నారు. గతంలో కమల్ హాసన్, ప్రభు హీరోలుగా వచ్చిన 'విజేతలు'ను ఈ సినిమా పోలి ఉంటుందని సమాచారం. కమల్ విక్రమ్ సూపర్ హిట్ అయ్యిన నేపధ్యంలో ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందని భావిస్తున్నారు.

చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా సాక్షి వైద్య నటిస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల తమన్‌ సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటుండడంతో ఏజెంట్‌ మ్యూజిక్‌పై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం మరో విశేషం. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రంలో నటిస్తోన్న అఖిల్‌ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios