టవల్ తో ఇలా చేస్తే.. ముఖంపై నల్ల మచ్చలు మటుమాయం
ముక్కు, చెంపలపై నల్ల మచ్చలు చాలా మందికి ఉంటాయి. కానీ వీటివల్ల అందం తగ్గుతుంది. వీటిని పోగొట్టేందుకు ఆడవారు రకరకాల క్రీం లను వాడుతుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా వీటిని సులువుగా పోగొట్టొచ్చు.

బ్లాక్ హెడ్స్
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం ఆడవారు వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయితే చాలా మంది ఆడవారికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి. ఇది చాలా చిన్న సమస్యే అయినా ముఖ అందాన్ని తగ్గిస్తుంది. ఎంత మేకప్ వేసుకున్నా వీటివల్ల అందంగా కనిపించరు. ముఖంలో ఇవే కనిపిస్తుంటాయి. ఈ మచ్చలను పోగొట్టేందుకు చాలా మంది వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. చాలా మందికి ఈ బ్లాక్ హెడ్స్ ముక్కు, గడ్డంపై వస్తాయి. అయితే వీటిని మీరు రూపాయి ఖర్చు లేకుండా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్లాక్ హెడ్స్
బ్లాక్ హెడ్స్ ను మనం రోజూ ఉపయోగించే టవల్ తో పోగొట్టొచ్చు. అవును జస్ట్ టవల్ ను ఉపయోగించి ముక్కు, గడ్డం మీదున్న బ్లాక్ హెడ్స్ ను లేకుండా చేయొచ్చు. ఇందుకోసం టవల్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి టవల్ ఎలా పనిచేస్తుంది?
వేడి టవల్ ముఖం మీదున్న రంధ్రాలను తెరిచి మురికిని పోగొడుతుంది. అలాగే ఇది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎలాంటి కెమికల్ లేనిది. కాబట్టి దీనిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ చర్మం క్లియర్ గా కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్ బాధ కూడా పోతుంది.
బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి టవల్ ను ఎలా ఉపయోగించాలి?
ఇందుకోసం మీ ముఖాన్ని శుభ్రంగా కడగండి. తర్వాత శుభ్రం చేసిన సాఫ్ట్ టవల్ ను తీసుకోండి. దీన్ని గోరువెచ్చని నీళ్లలో తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండండి. ఈ టవల్ వేడిగా ఉండాలి. దీనితో మీ ముఖానికి రెండు నిమిషాలు రాయండి. అలాగే బ్లాక్ హెడ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ టవల్ ను తేలిగ్గా రుద్దండి. తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖాన్ని కడిగిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ను పెట్టాలి.
బ్లాక్ హెడ్స్ ను పోగొట్టే ఇతర చిట్కాలు
బ్లాక్ హెడ్స్ పోవడానికి మీరు రోజూ ముఖానికి ఆవిరి కూడా పట్టొచ్చు. అలాగే నిమ్మకాయ, దాల్చిన చెక్క పేస్ట్ తో కూడా ఈ సమస్య పోతుంది. ఈ పేస్ట్ పెట్టడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గుతాయి. అలాగే బేకింగ్ సోడాను కూడా మీరు బ్లాక్ హెడ్స్ పోవడానికి ఉపయోగించొచ్చు. ఇదొక నేచురల్ ఎక్స్పోలియెంట్ గా పనిచేసి బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది. ఇందుకోసం దీన్ని పేస్ట్ చేసి బ్లాక్ హెడ్స్ కు వాడాలి.
బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయి?
బ్లాక్ హెడ్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మంపై చనిపోయిన కణాలు పేరుకుపోవడం, కాలుష్యం, ఆయిలీ స్కిన్, హార్మోన్లలో మార్పులు, చర్మ రంధ్రాల విస్తరణ వంటి వివిధ కారణాల వల్ల బ్లాక్ హెడ్స్ వస్తాయి.