MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • జుట్టుకు గుడ్డు, పెరుగు పెడితే ఏమౌతుందో తెలుసా?

జుట్టుకు గుడ్డు, పెరుగు పెడితే ఏమౌతుందో తెలుసా?

కండీషనర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అలాగే జుట్టు షైనీగా ఉంటుంది. ఇది మన జుట్టుకు మంచి పోషణను అందించి హెల్తీగా కూడా ఉంచుతుంది. అయితే కెమికల్ హెయిర్ కండీషర్ కు బదులుగా మీరు నేచురల్ కండీషనర్ ను కూడా ఉపయోగించొచ్చు.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 16 2025, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair conditioner
Image Credit : others

hair conditioner

హెయిర్ కండీషనర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు స్మూత్ గా, సిల్కీగా ఉంటుంది. అయితే మనకు మార్కెట్ లో రకరకాల హెయిర్ కండీషనర్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో హానికలిగించే కెమికల్స్ ఉంటాయి. ఇవి మన జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే నేచురల్ కండీషనర్ ను వాడాలని నిపుణులు చెప్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
hair conditioner
Image Credit : our own

hair conditioner

మీరే నేచురల్ హెయిర్ కండీషనర్ ను తయారుచేసుకుని వాడితే మీ జుట్టు అందంగా మెరిసిపోతుంది. ఆరోగ్యంగాను ఉంటుంది. స్మూత్ గా అవుతుంది. ఈ హెయిర్ కండీషనర్ ను తయారుచేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గుడ్డు, పెరుగుతో చాలా ఈజీగా హెయిర్ కండీషనర్ ను తయారుచేయొచ్చు. ఇది చౌకనదే కాకుండా మన జుట్టుకు మంచి పోషణను కూడా అందిస్తుంది. అలాగే జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. మరి ఈ నేచురల్ హెయిర్ కండీషనర్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

36
hair conditioner
Image Credit : our own

hair conditioner

జుట్టుకు గుడ్లు, పెరుగు ప్రయోజనాలు

గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, ప్రోటీన్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టును బలంగా చేస్తాయి. అలాగే వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే గుడ్డు పచ్చసొన మన జుట్టుకు నేచురల్ షైనింగ్ ను ఇస్తుంది. అలాగే డ్రై హెయిర్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.

అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది జుట్టుకు పట్టిన మురికిని తొలగిస్తుంది. చనిపోయిన కణాలను తొలగిస్తుంది. జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది. ఇకపోతే పెరుగును వాడటం వల్ల నెత్తిమీద పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. నెత్తిమీద దురద, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.

46
గుడ్డు,పెరుగు హెయిర్ కండీషనర్ ను ఎలా తయారు చేయాలి?
Image Credit : our own

గుడ్డు,పెరుగు హెయిర్ కండీషనర్ ను ఎలా తయారు చేయాలి?

కావాల్సిన పదార్థాలు:

ఒక గుడ్డు, రెండు మూడు టీ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ తేనె అవసరమవుతాయి.

తయారుచేసే విధానం

ముందుగా గుడ్డును తీసుకుని ఒక గిన్నెలో గిలకొట్టండి. దీనిలో పెరుగును వేసి బాగా కలపండి. మీ వెంట్రుకలు పొడిబారితే గనుక అందులో కొబ్బరి నూనె లేదా తేనెను వేసి కలపండి. అంతే నేచురల్ హెయిర్ కండీషనర్ రెడీ అయినట్టే. దీన్ని మీ నెత్తిమీద, జుట్టు మొత్తానికి అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో జుట్టును నీట్ గా కడగండి.

56
గుడ్డు, పెరుగు, అరటిపండు ప్యాక్
Image Credit : our own

గుడ్డు, పెరుగు, అరటిపండు ప్యాక్

ఒక గుడ్డును తీసుకుని అందులో రెండు టీస్పూన్ల పెరుగును వేసి, 1/2 గుజ్జు అరటిపండును వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ కండీషనర్ డ్యామేజ్ అయిన, పొడిబారిన జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది.

గుడ్లు, పెరుగు, కలబంద జెల్ ప్యాక్: ఒక గుడ్డులో రెండు టీస్పూన్ల పెరుగు, టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా మిక్స్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మీ నెత్తిని చల్లబరిచి జుట్టును హైడ్రేట్ చేస్తుంది.

66
ఈ చిట్కాలు పాటించాలి
Image Credit : our own

ఈ చిట్కాలు పాటించాలి

మీ జుట్టుకు గుడ్ల వాసన రాకూడదంటే మాత్రం జుట్టును చల్ల నీటితోనే వాష్ చేయాలి. మీకు గనుక గుడ్ల అలెర్జీ ఉంటే కేవలం పెరుగు, తేనెను మాత్రమే ఉపయోగించండి. ఈ ప్యాక్ ను వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ చేయాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
సౌందర్యం
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved