భర్తను ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?
వేరే ఇతర క్వాలిటీలు కూడా ఉండాలి. జీవితంలో ఒక లక్ష్యం , యాంబిషన్ లేకుండా.. ఒక నిర్దిష్ట ఆలోచనలు లేనివారు ఎంత అందంగా ఉన్నా.. వారితో పెళ్లి కి నిరాకరించడమే మంచిది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారు.
మన జీవితంలో సరైన భాగస్వామి ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆ భాగస్వామిని ఎంచుకునే హక్కు మన చేతుల్లోనే ఉంటుంది. కానీ తెలీకుండానే పొరపాట్లు చేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు.. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో చాలా పొరపాట్లు చేస్తుంటారట. ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం...
ఈ రోజుల్లో పెళ్లికి ముందే.. కాబోయే వాడు ఎలాంటివాడు.. అతను ఎప్పుడు ఎలా ఉంటాడో.. అతని అలవాట్లు ఏంటో మనకు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి.. అలాంటప్పుడు ముందుగా మన రిలేషన్ లోకి ఆహ్వానించే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
wedding
1.పెళ్లికి ముందే ఆ వ్యక్తి మీకు నచ్చని పనులు చేస్తున్నా.. అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే వారి జీవితంలోకి ఆహ్వానించకపోవడమే మంచిది. వారు ప్రతిదానికీ డ్రామా క్రియేట్ చేస్తున్నా.. మిమ్మల్ని కొట్టడం లాంటివి చేయడం.. మీ మనసుకు ఇబ్బందిగా అనిపించినా.. వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.
2.చూడటానికి అందంగా ఉండేవారిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అలాంటివారికి వెంటనే ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే.... పెళ్లి అందంగా ఉంటే సరిపోదు.. వేరే ఇతర క్వాలిటీలు కూడా ఉండాలి. జీవితంలో ఒక లక్ష్యం , యాంబిషన్ లేకుండా.. ఒక నిర్దిష్ట ఆలోచనలు లేనివారు ఎంత అందంగా ఉన్నా.. వారితో పెళ్లి కి నిరాకరించడమే మంచిది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారు.
wedding
3.కొందరికి వయసు పెరగుతుండటంతో... పెళ్లి ఆలస్యమౌతుందని.. వరుడిని ఎంచుకోవడంలో తప్పులు చేశారు. పెళ్లి ఆలస్యమౌతుందనే కంగారులో ఎవరిని పడితే వారిని చేసుకోవద్దు. సమయం అయిపోతుందని కంగారు పడితే.. తర్వాత జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4.నిజానికి మహిళల్లో సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుందట. మీరు పెళ్లి చేసుకోవాలి అనుకునే వ్యక్తిని చూసినప్పుడు మీకు ఇతను మంచివాడు కాదు అనే గట్ ఫీలింగ్ కలిగితే.. మరోసారి ఆలోచించడం మంచిది. అన్ని వివరాలు పూర్తిగా కనుక్కున్న తర్వాతే అడుగు ముందుకు వేయడం మంచిది. మీ మనసు చెబుతోంది అంటే మాత్రం మీరు ఆవిషయాన్ని ఇగ్నోర్ చేయడం మంచిది కాదు.
5.చాలా మంది డబ్బు ఎక్కువగా ఉందని కొందరిని పెళ్లి చేసుకుంటారు. ఆ పొరపాటు అస్సలు చేయకండి. డబ్బు ఒక్కటే పెళ్లికి అర్హత కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
6 people open-up about their fear of having sex on the wedding night
6.పెళ్లి చేసుకునే వ్యక్తి మనకు సెట్ అవుతాడో లేదో చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. జీవితాంతం కలిసి ఉండేది మీరే కాబట్టి.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుందాములే అని మాత్రం అనుకోవద్దు.