MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • 4 చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?

4 చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?

నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే నెయ్యి ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అవును నెయ్యిని ముఖానికి అప్లైచేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 31 2024, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆడవాళ్లు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పసుపు పెట్టడం, ముల్తానీ మట్టితో పాటుగా బయట దొరికే క్రీమ్స్ ను కూడా వాడుతుంటారు. ఏదేమైనా మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా ముఖం చర్మంలో చాలా మార్పులు వస్తాయి. స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలేం రాకుండా ఉండటానికి మీరు నెయ్యిని పెట్టొచ్చు. అవును ఇంట్లోనే దేశీ రెసిపీని తయారుచేసిన ముఖానికి అప్లై చేస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. అసలు నెయ్యి మన ముఖానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సహజంగా మెరవడం

నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ చిట్లిపోతాయి. దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తుంది. అక్కడక్కడ నలుపుదనం కూడా పోతుంది. నెయ్యి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

ముఖానికి నెయ్యిని అప్లై చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది మీ ముఖాన్ని గ్లో చేస్తుంది. 
 

35

చర్మం కాంతివంతంగా మారుతుంది

దేశీ నెయ్యిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. ఇది కెమికల్స్ ప్రొడక్ట్స్ మాదిరిగా ముఖ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. దీనివల్ల ఎలాంటి కొత్త చర్మ సమస్యలు రావు. 
 

45

చర్మాన్ని మృదువుగా మార్చుతుంది

ముఖ చర్మాన్ని మృదువుగా మార్చడానికి నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారే సమస్య పూర్తిగా పోతుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉండే మచ్చలను కూడా పోగొడుతుంది. 

55

ముఖానికి నెయ్యిని ఎలా అప్లై చేయాలి? 

ముఖానికి నెయ్యిని రాసుకోవాలంటే ముందుగా నెయ్యిని గోరువెచ్చగా చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పువ్వును వేసి కలపండి. కుంకుమపువ్వు, నెయ్యి కలిపిన తర్వాత 4 చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయండి.  దీన్ని తేలికపాటి చేతులతో 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రాత్రి పూట ముఖానికి నెయ్యిని అప్లై చేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి
Recommended image2
Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి
Recommended image3
Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved