Hair Growth: అవిసె గింజలు ఇలా వాడితే.. జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది..!
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలని, స్మూత్ గా కనిపించాలని చాలా మంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. కానీ, వాటి అవసరం లేకపోయినా కూడా జుట్టు అందంగా మార్చుకోవచ్చు. దాని కోసం అవిసె గింజలు వాడితే సరిపోతుంది.

Hair Growth
జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ, స్మూత్ గా పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. జుట్టును అలా అందంగా మార్చుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. కానీ.. వాటిలో ఉండే కెమికల్స్ జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. అయితే.. ఆ రసాయనాలు లేకుండా... సహజంగా కూడా జుట్టును అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
జుట్టును అందంగా మార్చే అవిసె గింజలు....
జుట్టును అందంగా మార్చడంలో అవిసెగింజలు చాలా బాగా పని చేస్తాయి. ఈ అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, లిగ్నన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ.. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. చుండ్రు సమస్యను తగ్గించడంతో పాటు, పొడి చర్మం సమస్యను తగ్గిస్తుంది. విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు కవచంలా మారతాయి. దీని వల్ల కాలుష్యం, వేడి, ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచిచ మీ జుట్టును కాపాడుకోవచ్చు. అంతేకాదు, అవిసె గింజలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల పోషకాలు బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.
అవిసె గింజల నీరు:
జుట్టు పెరుగుదలకు అవిసె గింజలను తీసుకోవడానికి సులభమైన , అత్యంత ప్రభావవంతమైన మార్గం అవిసె గింజల నీరు. ఇది తేలికగా, రిఫ్రెష్‌గా, రోజువారీ ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం, నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో త్రాగండి. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మీ జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఇది మీ జుట్టుకు రసాయనాలు లేదా మాత్రలు లేకుండా సహజ సప్లిమెంట్‌గా పనిచేస్తుంది.
అవిసె గింజల పొడి:
అవిసె గింజల నీరు తాగడం ఇష్టపడకపోతే, మీరు దానిని మరొక విధంగా తీసుకోవచ్చు. మీరు అవిసె గింజలను వేయించి, వాటిని పొడిగా చేసి మీ ఆహారంలో చల్లుకోవచ్చు. ఒక టీస్పూన్ కాల్చిన అవిసె గింజల పొడిని స్మూతీ, పెరుగు లేదా మజ్జిగలో కలపండి. వీరు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో అవిసె గింజల పొడి చల్లుకొని తింటే సరిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల.. మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
అవిసె గింజలు ఎంత తీసుకోవాలి?
రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు సరిపోతాయి. మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, రెండు స్పూన్లకు మించి తీసుకోకూడదు. ఉదయం దీనిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, జుట్టు పెరుగుదలకు కొంత సమయం పడుతుందని గుర్తుంచుకోండి. మీరు కనీసం 6 నుండి 8 వారాల పాటు నిరంతరం తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు.