జీవితంలో ఒక్కసారైనా చూసితీరాల్సిన టాప్ 5 గ్రామాలు ... ఫిదా అయిపోతారు
మీరు ప్రకృతి ప్రియులా? కాకపోయినా ఈ గ్రామాలు, పట్టణాల సహజ అందాలను చూసి ఫిదా కావాల్సిందే. ఇలాంటి ప్రకృతి అందాలను కలిగిన టాప్ 5 ప్రాంతాలగురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Travel Guide
Travel Guide : భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి... వాటిలో కొన్నింటిని మీరు ఇప్పటికే సందర్శించి వుండవచ్చు. అయితే జీవితంలో ఒక్కసారయినా సందర్శంచాల్సిన ప్రకృతి అందాలు కొన్ని వుంటాయి. ఇలా చూడగానే కట్టిపడేసే టాప్ 5 ప్రదేశాలేమిటో తెలుసుకుందాం.
1. మనాలి (Manali)
హిమాచల్ ప్రదేశ్ లోని కులూ వ్యాలీలోని అందమైన గ్రామం మనాలి. బియాస్ నది ఒడ్డున చుట్టూ ఎత్తయిన కొండలతో అందమైన పురాతన పట్టణమిది. మనాలి ప్రాంతాన్ని సప్తర్షులు నివాసమున్న ప్రాంతంగా పేర్కొంటారు.
హిమాలయాల పర్యటనకు వెళ్లేవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం మనాలి. వేసవిలోనూ ఈ ప్రాంతం చాలా చల్లగా వుంటుంది... అందువల్ల చాలామంది పర్యాటకులు ఈకాలంలోనే సందర్శిస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించేవారు మనాలిని తప్పకుండా సందర్శిస్తారు.
హనీమూన్ కోసం కొత్తగా పెళ్లయిన జంటలు మనాలికి ఎక్కువగా వెళుతుంటారు. దీంతో ఇది ప్రముఖ హనీమూన్ స్పాట్ గా మారింది. శీతాకాలం మధ్యలో అంటే డిసెంబర్, జనవరి... వేసవి మధ్యలో అంటే మే, జూన్ నెలల్లో ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. రోజుకు సుమారు 500 నుండి 600 జంటలు హనీమూన్ కోసం మనాలి వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి.
Ziro Valley
2. జిరో (Ziro) :
అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రకృతి అందాలకు నిలయం ఈ జిరో పట్టణం. ఆ రాష్ట్ర రాజధాని ఈటానగర్ కు దాదాపు 167 కిలోమీటర్ల దూరంగా ఈ పురాతన పట్టణం వుంటుంది. అందమైన ఈ హిల్ స్టేషన్ దట్టమైన అడవులు, వాగులు వంకలతో వుటుంది. సహజ అందాలో కూడిన ఈ చిన్న పట్టణం వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది.
అందమైన పర్వతాల మధ్య వుండే వరి పొలాలు ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. ఇక్కడి ప్రజలు కొండ వాలులో సాగుచేసే వరిపొలాలు చూడటానికి కనువిందు చేస్తాయి. ప్రాచీన ఆపతానీ తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం వుంటారు. ఏటా సెప్టెంబర్ నెలలో జిరోలో మ్యూజికల్ ఫెస్ట్ జరుగుతుంది.... ఇందులో దేశ విదేశీలకు చెందిన యువత పాల్గొంటారు.
3.గోకర్ణ (Gokarna) :
మన పక్కరాష్ట్రం కర్ణాటకలోని అద్భుతమైన శైవ క్షేత్రం మరియు సుందరమైన బీచ్ కలిగిన ప్రాంతం. భక్తికి భక్తి, ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్ కావాలంటే గోకర్ణ మంచి స్పాట్. ఇక్కడ సముద్రతీరాన శివాలయం చూడటానికి అద్భుతంగా వుంటుంది.
గోవాకు దగ్గరగా వుంటుంది గోకర్ణ. అందువల్లే గోవా టూర్ కు వెళ్లేవారు తప్పకుండా గోకర్ణను కూడా సందర్శిస్తుంటారు. ఈ గ్రామం పురాతన చరిత్రతో ఆధునిక లైఫ్ స్టైల్ ను కలిగివుంటుంది. ఇక్కడి అందమైన హాఫ్ మూన్, కుడ్ల, ఓం, ప్యారడైజ్ బీచ్ లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
దౌకి (Dawki)
భారత్,బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి మేఘాలయాలో వున్న చిన్న పట్టణం దౌకి. ఇక్కడ ఉమ్ గోట్ నది అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఈ నదిలోని నీరు చాలా స్వచ్చంగా వుంటుంది... ఎంతలా అంటే అడుగుభాగంలో వుండే రాళ్లు, జలచరాలు కూడా స్పష్టంగా కనిపించేలా వుంటాయి. ఇంత స్వచ్చమైన నీటిలో పడవప్రయాణం జీవితంలో మరపురాని అనుభూతిని ఇస్తుంది.
ఈ నది మధ్యలో రంగురంగు రాళ్లతో కూడిన చిన్న ద్వీపం వుంటుంది. పడవలో ఈ ద్వీపానికి చేరుకుని ఆ రంగురాళ్ల అందాలను వీక్షిస్తుంటారు పర్యాటకులు. ఇక పచ్చగా పరుచుకున్న చెట్లు, కొండల పైనుండి జాలువారే జలపాతాలతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది.
స్పితి (Spiti)
హిమాచల్ ప్రదేశ్ లోని మరో హిల్ స్టేషల్ స్పితి వ్యాలీ. మే నుండి అక్టోబర్ వరకు దీన్ని సందర్శించడానికి మంచి సమయం. ఇక్కడ చిచామ్ వంతెన, చంద్ర తాల్ సరస్సు, ధంకర్ సరస్సు, హిక్కిం గ్రామం, దేముల్ గ్రామం, కిబ్బర్ వన్యప్రాణుల అభయారణ్యం, లాంగ్జా గ్రామం బుద్ద విగ్రహం, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, టాబో గుహలు సందర్శనీయ ప్రదేశాలు.
మనాలి, సిమ్లాకు ఇది చాలా దగ్గరగా వుంటుంది.శీతాకాలంలో మంచు కురవడంవల్ల ఇక్కడికి దారులు మూసుకుపోతాయి. ఈ సమయంలో స్పితి అందాలు రెట్టింపు అవుతాయి.. అందువల్ల కాస్త ఇబ్బందులు ఎదురైనా శీతాకాలంలోనే సందర్శించడానికి చాలామంది ఇష్టపడతారు. సినిమావాళ్లు కూడా ఇక్కడ షూటింగ్ లు చేస్తుంటారు.