Travel Job: ట్రావెలింగ్ ఇష్టమా? తిరుగుతూ సంపాదించొచ్చు, ఎలానో తెలుసా?
ట్రావెలింగ్ ని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే.. బడ్జెట్ సమస్యలు, టైమ్ లేకపోవడం వల్ల అందరి కల నెరవేరకపోవచ్చు. అయితే మీరు హ్యాపీగా తిరుగుతూనే సంపాదించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? అన్ని దేశాలు తిరిగి చూడాలనే కోరిక ఉందా? కానీ మీకు టైమ్ లేకపోవడం, చేతిలో అంత డబ్బు లేకపోవడం వల్ల వెళ్లలేపోతున్నారా? అయితే ఇది కచ్చితంగా మీకోసమే. మీరు హ్యాపీగా దేశ దేశాలు తిరుగుతూ.. అక్కడి ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ డబ్బు కూడా సంపాదించొచ్చు. అసలు హ్యాపీగా తిరగడమే ఉద్యోగం. మరి, ఆ జాబ్ వివరాలు తెలుసుకుందామా...
ట్రావెల్ జాబ్స్ (Travel Jobs) స్పెషాలిటీ ఏంటంటే, వీటిని మీ వీలును బట్టి ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ చేయొచ్చు. మీకు ట్రావెల్, రాయడం ఇష్టమైతే బ్లాగులు రాయొచ్చు. ట్రావెల్ మ్యాగజైన్‌లో చేరి మీ కలలు నెరవేర్చుకోవచ్చు. మీరు కెమెరా ఫ్రెండ్లీ అయితే వీడియోలు చేసి మీ ఆడియన్స్‌ను మంచి ప్రదేశాలకు తీసుకెళ్లొచ్చు. ఈజీగా లక్షల్లో సంపాదించగల 10 ట్రావెల్ జాబ్స్ గురించి చూద్దాం.
టూర్ గైడ్స్ (Tour Guide)-
ఎక్కువగా ఎర్రకోట, తాజ్ మహల్ లాంటి టూరిస్ట్ ప్లేసెస్‌లో టూర్ గైడ్స్ ఉంటారు. వీళ్లు ఆ ప్లేస్ విశేషాలు, హిస్టరీ చెబుతారు. మీకు ట్రావెల్ ఇష్టమై, హిస్టరీలో ఆసక్తి ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ట్రావెల్ గైడ్ అవ్వొచ్చు. చాలా ట్రావెల్ ఏజెన్సీలు టూర్ గైడ్ పోస్టులకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తాయి. ట్రావెల్ ఏజెన్సీ తన గైడ్‌ను పర్యాటకులతో పంపిస్తుంది. టూర్ గైడ్ ఫుడ్, వసతి ఖర్చులను ట్రావెల్ ఏజెన్సీ చూసుకుంటుంది.
ఈవెంట్ కోఆర్డినేటర్ - (Event Coordinator)-
ఈ మధ్య ఈవెంట్ కోఆర్డినేటర్లకు డిమాండ్ పెరిగింది. మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, ఆర్గనైజేషనల్, స్ట్రాటజీ స్కిల్స్ ఉంటే ఇది మీకు మంచి జాబ్. మీరు వెడ్డింగ్ ప్లానర్ అయితే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆర్గనైజ్ చేసే నెపంతో చాలా ప్రదేశాలకు వెళ్లొచ్చు. ఈ పనిలో డబ్బు సంపాదించే మంచి అవకాశాలు ఉన్నాయి.
ట్రావెల్ వ్లాగర్లు - (Travel Vlogger)-
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ట్రావెల్ వ్లాగింగ్‌ను ఆదాయ మార్గంగా చేసుకున్నారు. ట్రావెల్ వ్లాగింగ్ ట్రెండింగ్ కెరీర్ ఆప్షన్స్‌లో ఒకటి. ప్రతి ట్రిప్ వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడం ద్వారా మీరు ట్రావెల్ వ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లాగ్‌లు పోస్ట్ చేస్తూ చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు.
క్రూయిజ్ షిప్ డైరెక్టర్:(Cruise Ship Director)
క్రూయిజ్ షిప్ డైరెక్టర్ శాలరీ ఏడాదికి 1.2 మిలియన్ నుంచి 6 మిలియన్ వరకు ఉండొచ్చు. ఈ జాబ్‌లో క్రూయిజ్ షిప్‌లో ప్రయాణికుల కోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి మీరు బాధ్యత వహిస్తారు. ఈవెంట్స్, క్విజ్‌లు, గేమ్స్, డ్యాన్స్ పార్టీలు, ఫుడ్, డ్రింక్స్.. ఏదైనా ఉండొచ్చు. క్రూయిజ్ షిప్ డైరెక్టర్‌గా మీరు ప్రపంచమంతా తిరిగే అవకాశం కూడా వస్తుంది.
ఈఎస్ఎల్ టీచర్ - (ESL Teacher)-
మీకు టీచింగ్ అంటే ఇష్టమై, ఈఎస్ఎల్ టీచర్‌గా అర్హత ఉంటే ఈ జాబ్ మీకు బెస్ట్. వేరే దేశాల్లో ఉండే భారతీయులకు మీ లోకల్ లాంగ్వేజ్ నేర్పించొచ్చు. దీనికోసం బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ. ఇండియాలో ఈఎస్ఎల్ టీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. గ్లాస్‌డోర్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈఎస్ఎల్ టీచర్లు నెలకు రూ.20,000 నుంచి రూ.42,000 వరకు సంపాదించవచ్చు. కొన్ని సంస్థల్లో నెల జీతం లక్ష రూపాయల వరకు కూడా ఉంటుంది.
(Marine Biologist):
మెరైన బయలజిస్ట్ వేతనం ఏడాదికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ఈ జాబ్‌లో నిపుణులు సముద్ర జీవులు, పర్యావరణాన్ని స్టడీ చేస్తారు. అదనంగా ప్రపంచమంతా ట్రావెల్ చేసే అవకాశం ఉంది.
ఎయిర్‌లైన్ పైలట్:(Airline Pilot)
ఎయిర్‌లైన్ పైలట్ శాలరీ ఏడాదికి 20 లక్షల నుంచి 84 లక్షల వరకు ఉంటుంది. ఈ జాబ్‌లో విమానం నడిపే బాధ్యత ఉంటుంది. అదనంగా మీరు ప్రపంచమంతా ట్రావెల్ చేయొచ్చు. మీరు ఫ్లైట్ అటెండెంట్ లేదా ఫ్లైట్ స్టీవార్డ్‌గా కూడా మీ కలను నెరవేర్చుకోవచ్చు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో జాబ్ కొడితే కంపెనీ మీ లైఫ్, ఫుడ్ ఖర్చులు కూడా చూసుకుంటుంది.
ట్రావెల్ వ్లాగర్ / ఇన్ఫ్లుయెన్సర్ - (Travel Vlogger/ Influencer)-
ట్రావెల్ వ్లాగర్ / ఇన్ఫ్లుయెన్సర్ శాలరీ ఏడాదికి ₹ 3 లక్షల నుంచి ₹ 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ. ఈ జాబ్‌లో మీరు మీ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌లను ప్రజలతో షేర్ చేసుకుంటారు. ఇది దేశం, ప్రపంచమంతా ట్రావెల్ చేయడానికి స్పెషల్ అవకాశాలు ఇస్తుంది. మీరు రకరకాల నేషనల్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌కు హాజరై వాటి గురించి రాయొచ్చు. ఫారిన్‌లో హోటల్స్ లేదా రకరకాల దేశాల గవర్నమెంట్స్ నుంచి కూడా మీకు ఇన్విటేషన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెంట్ - (International Business Consultant)
ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెంట్ శాలరీ ఏడాదికి 1.5 మిలియన్ నుంచి 8 మిలియన్ రూపాయల వరకు ఉండొచ్చు. ఈ జాబ్‌లో మీరు రకరకాల దేశాల్లో బిజినెస్ చేసే కంపెనీలకు సలహా ఇవ్వాలి. ఇది ప్రపంచమంతా ట్రావెల్ చేయడానికి అవకాశం ఇస్తుంది.
లగ్జరీ ట్రావెల్ అడ్వైజర్ : (Luxury Travel Advisor Job):
లగ్జరీ ట్రావెల్ అడ్వైజర్ శాలరీ ఏడాదికి 8 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ఈ జాబ్‌లో లగ్జరీ ట్రావెల్ కోరుకునే పర్యాటకులకు మీరు ట్రావెల్ అరేంజ్ చేయాలి. లగ్జరీ ట్రావెల్ అడ్వైజర్‌గా మీరు దేశం, ప్రపంచమంతా ట్రావెల్ చేయొచ్చు.