MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Travel
  • Best Tourist Places: తక్కువ ఖర్చుతో ప్రపంచంలో చూడదగ్గ టాప్ 10 ప్రదేశాలు ఇవే

Best Tourist Places: తక్కువ ఖర్చుతో ప్రపంచంలో చూడదగ్గ టాప్ 10 ప్రదేశాలు ఇవే

Best Tourist Places: ప్రపంచం చుట్టి రావాలంటే చాలా డబ్బులు కావాలని చాలామంది అనుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో అద్భుతమైన ప్రదేశాలు చూసి రావచ్చు. అలాంటి తక్కువ ఖర్చుతో చూడదగ్గ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Mar 15 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

శ్రీలంక

తక్కువ ఖర్చుతో చూడదగిన అందమైన ప్రదేశం శ్రీలంక. ఇక్కడ అందమైన బీచ్‌లు, తేయాకు తోటలు, పురాతన శిథిలాలు ఉన్నాయి. భారత దేశం నుంచి శ్రీలంకకు ఫ్లైట్ టికెట్స్ సుమారు రూ.10 వేల నుంచి ఉంటాయి. అక్కడ రోజుకు స్టేయింగ్, ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.4 వేలు అవుతుంది.  

జార్జియా 

యూరప్, ఆసియా మధ్యలో ఉన్న జార్జియాలో కొండ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి.  ఇండియా నుంచి ఈ దేశం వెళ్లాలన్నా కేవలం రూ.15 వేల లోపు ఖర్చు చేస్తే సరిపోతుంది.

25
Asianet Image

మెక్సికో

మెక్సికోలో పురాతన శిథిలాలు, సందడిగా ఉండే నగరాలు, అందమైన బీచ్‌లు చాలా ఫేమస్. మెక్సికో  సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది. అది తెలుసుకోవడానికైనా ఆ దేశం ఓసారి చూసి రావాలి.

వియత్నాం

వియత్నాం బడ్జెట్ ట్రావెలర్స్‌కు స్వర్గంలాంటిది. ఇక్కడ రుచికరమైన వీధి ఆహారం దొరుకుతుంది. వియత్నాం వెళ్లాలంటే భారతీయులకు వీసా అవసరం లేదు. అందువల్ల డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాదు. వియత్నాం వెళ్లాలంటే సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఖర్చు పెడితే సరిపోతుంది.
  

35
Asianet Image

ఇండోనేషియా 

ఈ దేశంలో బాలి చాలా ఫేమస్ అయిన ప్రదేశం. ఇండోనేషియాలో 17,000కు పైగా దీవులు ఉన్నాయి. అందుకే వీటిని  చూసి ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఆ దేశానికి పర్యాటకం పెద్ద ఆదాయ మార్గం. ఇండోనేషియా వెళ్లాలన్నా భారతీయులు వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే విమాన ఖర్చులు రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి.   

అల్బేనియా

యూరప్‌లో తక్కువ బడ్జెట్ తో వెళ్లగలిగిన ప్రాంతం అల్బేనియా. ఎక్కువ ఖర్చు పెట్టకుండా మెడిటరేనియన్ అందాలను చూడాలనుకుంటే అల్బేనియా బెస్ట్ ప్లేస్.  

45
Asianet Image

నేపాల్

తక్కువ బడ్జెట్‌లో అల్టిమేట్ అడ్వెంచర్ ప్లేస్ నేపాల్.  మీరు ప్రకృతి ప్రేమికులైతే లేదా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే నేపాల్ బెస్ట్ ప్లేస్. నేపాల్ వెళ్లాలంటే భారతీయులకు వీసా అవసరం లేదు. అందువల్ల అన్ని ఖర్చులకు కేవలం రూ.10 వేల లోపే సరిపోతాయి.

పోర్చుగల్

యూరప్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ పోర్చుగల్. యూరప్‌లోనే తక్కువ ధరలో చూడదగ్గ ప్రదేశం ఇది. ఇక్కడ రుచికరమైన వంటకాలను మీరు రుచి చూడొచ్చు. 

55
Asianet Image

ఈజిప్ట్

ఈజిప్ట్‌లో పురాతన కట్టడాలు చూసి వాటి చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ అడ్వెంచర్ ప్లేస్ లు కూడా ఉన్నాయి. భారతదేశానికి ఈజిప్ట్ కాస్త దూరంగానే ఉన్నా తక్కువ ఖర్చులో తీసుకెళ్లి, తీసుకొచ్చే ఇంటర్నేషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. 

బొలీవియా

సౌత్ అమెరికాలో తక్కువ ధరలో చూడదగ్గ ప్రదేశం బొలీవియా. బడ్జెట్ ట్రావెలర్స్‌కు డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. భారతీయులు వీసా ఆన్ అరైవల్ సదుపాయం ద్వారా బొలీవియా వెళ్లొచ్చు. కేవలం రూ.30 వేల లోపే ఈ దేశం చుట్టి రావచ్చు.  

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved