Male River: భారత్ లో ప్రవహించే ఏకైక మగ నది ఏంటో తెలుసా?
మన దేశంలో చాలా నదులు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం నదులను తల్లిగా భావిస్తారు. అన్ని నదలకు స్త్రీల పేర్లే ఉంటాయి. కానీ, మగ నది ఒకటి మన దేశంలో ఉందని మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతదేశంలో నదులు చాలా ఉన్నాయి. ఒక్కో నదికీ ఒక్కో పేరు ఉంటుంది. దాదాపు అన్ని నదులకు స్త్రీల పేర్లే ఉంటాయి. ఆ నదులను తల్లిగా కూడా భావిస్తాం. మన దేశంలో స్త్రీలకు ఇచ్చే ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి.. దాదాపు నదులన్నింటికీ స్త్రీల పేర్లే ఉంటాయి. కానీ, మన దేశంలో ప్రవహించే ఒకే ఒక్క నదికి పురుషుడి పేరు ఉంది. మరి ఆ నది ఏంటో తెలుసుకుందామా....
గంగా, యమునా, నర్మదా, గోదావరి వంటి నదులను కూడా స్త్రీలుగా పరిగణిస్తారు. అందుకే ఈ నదులను తల్లులు అని పిలుస్తారు. ఉదాహరణకు గంగా మాత, తల్లి గంగ అని పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ నదుల గురించి చాలా గొప్ప నమ్మకం ఉంది. నదులను దేవుడితో సమానంగా పూజిస్తారు. నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని కూడా చెబుతారు.
కానీ ఈ నదులను ఆడవిగా పూజించే ఈ దేశంలో కూడా ఒక ఆశ్చర్యం ఉంది. అదేమిటంటే భారతదేశంలో తండ్రిగా పరిగణించబడే ఒక నది ఉందని మీకు తెలుసా?
ఈ నది మరేదో కాదు బ్రహ్మపుత్ర నది (Brahmaputra river), దీన్ని భారతదేశంలో ఏకైక పురుష నది అని అంటారు. ఎందుకంటే ఇది బ్రహ్మ దేవుడి కొడుకు అని నమ్మకం.
ధార్మిక నమ్మకం ప్రకారం, బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మ దేవుడి కొడుకుగా పరిగణిస్తారు, అందుకే దీన్ని పురుష నది అని పిలుస్తారు. మిగిలిన నదులను ఆడవిగా పూజిస్తే, ఈ నదికి మగ స్థానం ఇస్తారు. మంచు పర్వతాల్లో పుట్టే ఈ నదిని పవిత్ర నది అని కూడా పూజిస్తారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిని ప్రత్యేకంగా పూజిస్తారు.
ఈ బ్రహ్మపుత్ర నది పొడవు సుమారు 2900 కిలోమీటర్లు. ఇది టిబెట్‌లోని మానస సరోవరం దగ్గర చెమయుంగ్డుంగ్ హిమానీనదం నుంచి పుడుతుంది. అందుకే అక్కడి ప్రజలు ఈ నదిని పూజిస్తారు.