MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Travel
  • Best tourist spot: ఈ సమ్మర్ లో టూర్ కి వెళ్లాలి అనుకుంటే.. బెస్ట్ టూరిస్ట్ స్పాట్లు ఇవే!

Best tourist spot: ఈ సమ్మర్ లో టూర్ కి వెళ్లాలి అనుకుంటే.. బెస్ట్ టూరిస్ట్ స్పాట్లు ఇవే!

కాస్త టైం దొరికితే చాలు.. చాలామంది టూర్లకు వెళ్లుంటారు. మనం ఓపికగా తిరిగి చూడాలే కానీ.. దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి. చాలామంది నచ్చిన ప్లేస్ అని ఎప్పుడూ ఒకే ప్రాంతానికి టూర్ కి వెళ్తూ ఉంటారు. కానీ అన్ని తిరిగి చూస్తేనే కదా అసలు ప్రకృతి అందాలు ఆస్వాదించేది. మరి ఆ బెస్ట్ టూరింగ్ స్పాట్లు ఏంటో ఒకసారి చూసేయండి.  

2 Min read
Author : Kavitha G
Published : Feb 08 2025, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మజులి ద్వీపం

మజులి ద్వీపం

అస్సాంలోని బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న అందమైన దీవి మజులి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నది ద్వీపంగా పేరు పొందింది. ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఈ దీవి మొత్తం 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

మజులి దీవి బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉండటంతో అక్కడికి వెళ్లడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ వెళ్తే మాత్రం తిరిగి రావడానికి కూడా ఇష్టపడరు. మజులి ద్వీపం చూడాలనుకునేవారు వర్షాకాలం తప్పా ఎప్పుడైనా వెళ్లచ్చు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
జిరో వ్యాలీ

జిరో వ్యాలీ

పచ్చని కొండలు, వరి పొలాలతో నిండిన జిరో వ్యాలీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రదేశం. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ ప్రాంతం ప్రత్యేకమైన గిరిజన గ్రామాలకు చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ హిల్ స్టేషన్‌లో రకరకాల గిరిజన తెగలకు చెందిన వారు జీవిస్తున్నారు. 

అపతానీ తెగకు చెందిన గిరిజనులకు ఇది పుట్టినిల్లు. కొన్ని సంచార జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం. పచ్చని ప్రకృతితో పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. 

 

310
గోకర్ణ

గోకర్ణ

గోవాకు ప్రత్యామ్నాయంగా చాలామంది గోకర్ణకు వెళ్తుంటారు. ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రాచీన బీచ్‌లు, ఆధ్యాత్మిక వైబ్‌ ఎక్కువగా ఉంటుంది. ట్రెక్కింగ్ ట్రైల్స్, కుడ్లే, ఓం బీచ్ లాంటి ప్రశాంతమైన తీరాలతో గోకర్ణ అత్యంత సుందరమైన ప్రదేశం. ఇది సాహసం, విశ్రాంతి రెండింటికీ సరైనది.

 

410
పాటన్

పాటన్

గుజరాత్ లోని పాటన్ ఒక పురాతన పట్టణం. ఇది కోటలకు ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. క్లిష్టమైన శిల్పాలు, చారిత్రక ఆకర్షణ సందర్శకులను వెనకటి కాలంలోకి తీసుకువెళ్తాయి.

 

510
చోప్తా

చోప్తా

ఉత్తరాఖండ్ లోని చోప్తాను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. చోప్తా హిమాలయాల అద్భుతమైన అందాలను చూపిస్తుంది. తుంగనాథ్, చంద్రశిల ట్రెక్‌లకు ఇది స్థావరం. ఇది ట్రెక్కర్లు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.

 

610
కుంభల్‌గఢ్

కుంభల్‌గఢ్

రాజస్థాన్ లోని కుంభల్‌గఢ్ కోట.. 36 కిలోమీటర్ల పొడవైన గోడతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇది చైనా గోడ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతి పొడవైనది. తప్పకుండా చూడదగిన ప్రదేశాల్లో కుంభల్ గడ్ కోట ఒకటి.

710
మావ్లిన్నోంగ్

మావ్లిన్నోంగ్

ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా పిలిచే మావ్లిన్నోంగ్ అందమైన ప్రాంతం. ఇది మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉంటుంది. ఇది మంచి టూరింగ్ స్పాట్. ఇక్కడికి వెళ్తే పర్యాటకులకు చాలా రిఫ్రెష్ అవుతారు.

 

810
స్పితి వ్యాలీ

స్పితి వ్యాలీ

హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ ప్రకృతి సౌందర్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ జనారణ్యం తక్కువగా ఉంటుంది. స్పితి అనేక పురాతన మఠాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో కొన్ని వెయ్యి సంవత్సరాల నాటివి. ఇది రోడ్ ట్రిప్పులు, సాహస అన్వేషకులకు బెస్ట్ ప్లేస్.

910
హంపి

హంపి

తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో కర్ణాటక లోని హంపి ఒకటి. ఇదొక చారిత్రక నగరం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు హంపిలో ప్రదేశాలను సందర్శించడానికి ఉత్తమ సమయం. ఆ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

1010
వర్కాల

వర్కాల

కేరళలోని ప్రధాన తీరప్రాంతాల్లో వర్కాల ఒకటి. ఇది చాలా ప్రశాంతమైన గ్రామం. ఇక్కడ శివగిరి మఠం, జనార్దన దేవాలయంతో పాటు వివిధ పురాతన దేవాలయాలు ఉన్నాయి. యోగా కేంద్రాలు, ఆయుర్వేద చికిత్సలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved