తెలంగాణ కుర్రాడి సక్సెస్ స్టోరీ : నెలకు రూ.16 లక్షల సాలరీతో అమెజాన్ లో ఉద్యోగం
పట్టుదలతో చదివితే ఎంతటి అద్భుత విజయాలను సాధించవచ్చో ఈ తెలంగాణ కుర్రాడు నిరూపించాడు. ఓ మల్టినేషనల్ కంపనీ ఈ కుర్రాడికి జాబ్ ఆఫర్ చేసింది... అతడి సాలరీ ఎన్ని కోట్లో తెలుసా?
Youngster Success Story
Youngster Success Story : 'కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు', 'పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీలేదు'... ఇలాంటి మాటలు ఊరికే పుట్టలేదు. ఒకప్పుడు చందమామ రావే అని పాడుకున్నవాళ్ళం ఇప్పుడు చంద్రుడిపైకే వెళ్లగలిగాం... నిజంగానే మనిషి అనుకుంటే దేన్నయినా సాధించగలడు అనడానికి ఇదే మంచి ఉదాహరణ. ఇలా జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకుని... అది సాధించేందుకు మనసుపెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఇలా ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు అనుకున్నది సాధించి వార్తల్లో నిలిచాడు.
వికారాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషి జాక్ ఫాట్ కొట్టాడు. అతడు ప్రముఖ అంతర్జాతీయ (మల్టి నేషన్) కంపనీలో ఉద్యోగాన్ని సాధించాడు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ పల్లెటూరి కుర్రాడికి ఏకంగా రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. ఖురేషీ ఈరోజే(సోమవారం) ఉద్యోగంలో చేరనున్నాడు.
Arbaz Qureshi
ఎవరీ అర్బాజ్ ఖురేషి :
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలంలోని ఓ చిన్న గ్రామం తుంకిమెట్ల. కనీస సదుపాయాలు లేని ఆ గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు అర్బాజ్ ఖురేషి. చిన్నప్పటినుండి చదువులో మంచి ప్రతిభ కనబర్చడంలో ఆ కుటుంబం అతడిని ప్రోత్సహించింది. తల్లిదండ్రులు, టీచర్ల సహకారంతో అతడు మంచి మార్కులతో పాఠశాల విద్యను పూర్తిచేసాడు.
దేశంలోనే అత్యున్నతమైన విద్యాసంస్థలైన ఐఐటి లో సీటు సాధించడానికి ఇంటర్మీడియట్ చేరిన మొదటిరోజు నుండే కష్టపడ్డాడు. ఇలా పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్నది సాధించాడు. పాట్నా ఐఐటీలో సీటు సాధించాడు. అక్కడే ఈ తెలంగాణ కుర్రాడి జీవితం మారిపోయింది. దేశ నలుమూలల నుండి వచ్చిన తోటి విద్యార్థులతో కలిసి ఖురేషీ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు... ఇవి అతడి కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఐఐటిలో చదువుకుంటూనే ప్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ ఎక్స్ పర్ట్ గేల్ డయాస్ వద్ద ఇంటర్న్ షిప్ చేసాడు. కేవలం మూడు నెలలే ఈ ఇంటర్న్ షిప్ కొనసాగినా ఇది ఖురేష్ కెరీర్ లో ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇలా బిటెక్ చదువుతూనే చాలా విషయాలు నేర్చుకున్నాడు. 2019 లో కంప్యూటర్ సైన్స్ పట్టాతో ఐఐటి నుండి బయటకు వచ్చాడు అర్బాజ్ ఖురేషీ.
Youngster Success Story
ఐఐటి నుండి అమెజాక్ వరకు ఖురేషి ప్రయాణం :
ఐఐటి పాట్నాలో బిటెక్ పూర్తిచేయగానే అతడికి ప్రముఖ ఐటీ కంపనీ మైక్రోసాప్ట్ లో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో రెండేళ్లపాటు మైక్రోసాప్ట్ రీసెర్చ్ టీం లో పనిచేసాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఏఐ(Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ లో ఎంఎస్ పూర్తిచేసాడు. ఇలా గతేడాది 2023 లోనే అతడు ఎంఎస్ పూర్తిచేసాడు.
అయితే తాజాగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అర్బాజ్ ఖురేషి ప్రతిభను గుర్తించింది. అతడు తమకు ఎంతగానో ఉపయోగపడతాడని భావించి భారీ ప్యాకెజీతో ఉద్యోగం ఇచ్చారు. ఏడాదికి రూ.2 కోట్ల భారీ ప్యాకేజీతో ఈ తెలంగాణ కుర్రాడిని ఉద్యోగంలో చేర్చుకుంది ఈ మల్టినేషన్ కంపనీ. ఈ లెక్కన ప్రతి నెలా రూ.16 లక్షలకు పైగానే జీతం అందుకోనున్నాడు అర్బాజ్ ఖురేషి.
తమ కొడుకు భారీ ప్యాకేజీతో అమెజాన్ లో జాబ్ సాధించడంపై తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అర్బాజ్ తండ్రి యాసిన్ ఖురేషి కొడుకు సక్సెస్ ను చూసి మురిసిపోతున్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాయింట్ కమీషనర్ గా పనిచేస్తున్నారు.