MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • అక్క అనుమానాస్పద మృతి: చెల్లె పరార్, వీడని మిస్టరీ

అక్క అనుమానాస్పద మృతి: చెల్లె పరార్, వీడని మిస్టరీ

ఒక్క రాత్రి ఆ కుటుంబంతో తీరని విషాదాన్ని నింపింది. ఓ కూతురు అనుమానాస్పద రీతిలో చనిపోగా, మరో కూతురు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 30 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Korutla

Korutla

జగిత్యాల : కూతుర్లిద్దరూ ఒకరికొకరు తోడుగా వుంటారని నమ్మి తల్లిదండ్రులు బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్ళారు. కానీ రాత్రి ఏం జరిగిందో తెలీదు పెద్దకూతురు ఇంట్లో శవమై తేలగా చిన్నకూతురు ఓ యువకుడితో వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కూతుళ్లు దూరంకావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Korutla

Korutla

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం బీమునిదుబ్బలో నివాసముండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దకూతురు దీప్తి(24) సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా చిన్నకూతురు చందన బీటెక్ పూర్తిచేసి ఇంటివద్దే వుంటోంది. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటున్నాడు. ఆనందంగా సాగుతున్న వీరి జీవితం ఒక్క రాత్రి పూర్తిగా మారిపోయింది. 

37
Korutla

Korutla

నిన్న (మంగళవారం) బంధువుల ఇంట శుభకార్యం వుండటంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటినుండే పనిచేస్తున్న పెద్దకూతురు దీప్తి, చిన్నకూతురు చందన ఒకరికొకరు తోడుగా వుండటంతో రాత్రికి బంధువుల ఇంట్లోనే వున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ రాత్రి ఏమయ్యిందో తెలీదు దీప్తి ప్రాణాలు కోల్పోగా, చందన కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి సోఫాలో కూతురు మృతదేహం కనిపించింది. చిన్నకూతురు గురించి ఎంత వెతికినా కనిపించలేదు. ఇలా ఇద్దరు కూతుళ్లు ఒకేసారి దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 

47
Korutla

Korutla

శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మద్యం బాటిల్స్ వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలీసులు కోరుట్ల బస్టాండ్ లోని సిసి కెమెరాలను పరిశీలించగా చందన తెల్లవారుజామున ఓ యువకుడితో కనిపించింది. దీంతో ఈ ఇద్దరూ కలిసే దీప్తిని చంపి పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

57
Korutla

Korutla

పెద్ద కూతురును చిన్న కూతురే చంపివుంటుందన్న పోలీసుల అనుమానాన్ని తల్లిదండ్రులు మాత్రం నమ్మడంలేదు. దీంతో పోలీసులు దీప్తిది అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందనతో పాటు వున్న యువకుడు ఎవరు? వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారు దొరికితేనే దీప్తి హత్య మిస్టరీ వీడనుంది. 


 

67
Korutla

Korutla

కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడే వున్నవారితో కన్నీరు పెట్టిస్తోంది. చిన్నకూతురు చందన భాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ పని చేసిందన్న అనుమానం ఆ తల్లిదండ్రులను మరింత బాధిస్తోంది. 
 

77
Korutla

Korutla

యువతుల తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున 5.12 నిమిషాల నుండి 5.16 నిమిషాల వరకు చందన ఓ యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు నిజామాబాద్ బస్సులు ఆగేచోట వుండటం అక్కడికే వెళ్లివుంటారని అనుమానిస్తున్నారు. వారికోసం గాలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Recommended image2
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image3
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved