కేసీఆర్ కేబినెట్ లోకి కల్వకుంట్ల కవిత: ఎవరికి చెక్?

First Published 12, Oct 2020, 12:30 PM

కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా, షకీల్, జీవన్ రెడ్డి అంటున్నారు.

కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా, షకీల్, జీవన్ రెడ్డి అంటున్నారు. నిజానికి ఎమ్మెల్సీగా పదవీ కాలం 2022 జనవరితో ముగుస్తుంది. అంటే కేవలం 15 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. అంత మాత్రానికి ఆమెను నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించడంలోని రహస్యమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఎమ్మెల్సీగా ఎన్నికైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ తనయ మాజీ ఎంపీ కల్వకుంట్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ దూకుడు ప్రదర్శించనున్నారు. ఆమె నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఆమె కేసీఆర్ మంత్రివర్గంలో చేరే అవకాశాలు దండిగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎవరో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువు దీరి ఉంది. రాష్ట్ర శాసనసభ సంఖ్యను బట్టి కేవలం 17 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే, ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులను తొలగిస్తే విమర్శలు ఎదుర్కునే అవకాశం ఉంది. సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో అగ్రవర్ణాలకు చెందిన వారినే మంత్రివర్గం నుంచి తప్పించడానికి కేసీఆర్ పూనుకోవచ్చు. అయితే, ఈ 15 నెలల కాలం కవితను కేసీఆర్ ఎమ్మెల్సీగానే కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది.

కవితకు ప్రభుత్వంలో కీలక బాధ్యత అప్పగించి కేబినెట్ హోదా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, అందుకు కవిత సమ్మతిస్తారా అనేది ప్రశ్న. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ రెండో స్థానంలో ఉన్నారు. కేసీఆర్ తర్వాతి స్థానం ఆయనదే. అటువంటి స్థితిలో కవితకు ఏ విధమైన స్థానం ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది.

కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. అటువంటి స్థితిలో కేసీఆర్ తప్పుకుని కుమారుడి ఆ బాధ్యతలు అప్పగిస్తే కవితను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని అంటున్నారు. దీనికి ఎంత కాలం పడుతుందనేది వేచి చూడాల్సిందే.

loader