MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • కులాల కుంపటిలోకి దేశ ప్రధానిని ఎందుకు లాగారు? రేవంత్‌ అన్నట్లు నిజంగానే మోదీ కులం మారారా.?

కులాల కుంపటిలోకి దేశ ప్రధానిని ఎందుకు లాగారు? రేవంత్‌ అన్నట్లు నిజంగానే మోదీ కులం మారారా.?

తెలంగాణలో కులాల కొట్లాట పీక్స్‌కి చేరింది. కులగణన సర్వే నివేదికతో మొదలైన కులాల కొట్లాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు.? ఈ వ్యవహారంలోకి ప్రధాని ఎందుకు వచ్చారు.? ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం..   

3 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 15 2025, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
revanth reddy modi

revanth reddy modi

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదికలో బీసీ సంఖ్య తగ్గించి చూపారని రచ్చ మొదలైంది. ఇటు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో తక్కు వ సంఖ్య ఉన్న మాలలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారని దుమారం రేగింది. దీంతో దీన్ని విపక్షలు అస్త్రంగా మార్చుకున్నాయి. అటు బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మోదీ కులంపై.. 

హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో నిర్వహించిన కుల‌గణ‌న‌, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన 'లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ' అని చెప్పుకొచ్చారు. 2002 వ‌ర‌కు మోదీ ఉన్నత వ‌ర్గమేనని అయితే మోదీ గుజ‌రాత్ సీఎం అయ్యాకే, ఆయ‌న కులాన్ని బీసీల్లో క‌లిపార‌ని రేవంత్‌రెడ్డి బాంబ్‌ పేల్చారు. అక్కడితో ఆగకుండా స‌ర్టిఫికెట్ ప్రకార‌మే మోదీ బీసీ అని.. మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకుల‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మోదీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహాలో కులగణన చేయాలని సీఎం రేవంత్ అన్నారు. మోదీ బీసీ వ్యతిరేకి కాబట్టే కేంద్ర ప్రభుత్వం కులగణన ఊసెత్తడం లేదని రేవంత్ విమర్శించారు. 

35
k Laxman

k Laxman

బీజేపీ నేతలు ఫైర్‌.. 

రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్‌ అటాక్‌కి దిగారు. రేవంత్‌ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని దుమ్మొత్తి పోశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని.. కానీ 1994లోనే గుజరాత్‌లోని అప్పటి  ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 

ఇక కిషన్‌ రెడ్డి సైతం రేవంత్‌పై ధ్వజమెత్తారు. రేవంత్‌ దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిందటూ సూచించారు. 

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు ఏకంగా రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేశారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కులం ఏంటో, మతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆ సమయానికి మోదీ పాలిటిక్స్‌లో లేరు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. 1994లో గుజరాత్‌ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీలో కలిపిందన్నారు. ఇక 1999లో కేంద్ర ప్రభుత్వం ఈ కులాన్ని దేశవ్యాప్తంగా బీసీలో కలిపిందన్నారు. ప్రధాని మోదీ కులాన్ని గుజరాత్ ప్రభుత్వం బీసీలో కలిపినప్పుడు 1994లో మోడీ ఎలక్ట్రోరల్ పాలిటిక్స్ లో లేరని అర్వింద్‌ స్పష్టం చేశారు. కులం గురించి మాట్లాడి రచ్చ చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి మోడీ కులం పై మాట్లాడుతున్నారని అర్వింద్ విమర్శించారు. 
 

45
Narendra MOdi

Narendra MOdi

మోదీది నిజంగానే అగ్ర కులమా.? 

నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్‌ 17వ తేదీన గుజరాత్‌లోని వాద్‌ నగర్‌ ప్రాంతంలో 'మోద్ ఘాంచి' అనే కులంలో జన్మించారు. ఆ సమయానికి ఆ కులం ఓసీ జాబితాలో ఉండేది అయితే 1999లో ఈ కులాన్ని కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చింది. మండల్ కమిషన్ సిఫారసు మేరకు మోద్ ఘాంచి కులాన్ని ప్రభుత్వం ఓబీసీల జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని జాతీయ బీసీ కులాల కమిషన్‌ గతేడాది ప్రకటించింది. 

55
Revanth Reddy

Revanth Reddy

వ్యక్తిగతంగా దూషించలేదు: రేవంత్‌ 

ఇదిలా ఉంటే మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో మరోసారి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ విషయమై స్పందించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించలేదని తెలిపారు. ప్రధాని హోదాను అగౌరవపర్చలేదని, పుట్టుకతోనే ఆయన బీసీ కాదు అని మాత్రమే చెప్పానన్నారు. అయితే మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరి ఈ కులాల కుంపటి ఇక్కడితో అయినా చల్లబడుతుందా.? లేదా ఇలాగే కొనసాగుతుందా.? చూడాలి. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved