MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?

Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?

ఎక్కడో ఎల్ నినో ఏర్పడితే ఇండియాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సేమ్ అలాగే ఎక్కడో తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడటంతో వర్షాలు జోరందుకుంటాయట.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 22 2026, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంటున్న వర్షాలు
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంటున్న వర్షాలు

Heavy Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూలై చివర్లో మాదిరిగానే ఆగస్ట్ ఎండింగ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు ఇవాళ్టి (ఆగస్ట్ 22, శనివారం) నుండి కాస్త ఊరట లభించనుంది... వానలు మొదలవుతాయని ప్రకటించాయి. ముఖ్యంగా ఆగస్ట్ 22 నుండి 26 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు
Image Credit : Gemini AI

అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు

ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో 2 తుపానులు కొనసాగుతున్నాయి... ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇక ఇదే పసిఫిక్ సముద్రంలో రెండు వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాలను ప్రభావితం చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి.

రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేరుగా ఉంటుంది... వర్షాలు జోరందుకుంటాయి. ఇలా ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖలు, నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్
Related image2
Heavy Rains Alert : బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్
34
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

నేడు తెలంగాణలో భారీ వర్షాలు

ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఎండ, ఉక్కపోత కొనసాగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు మొదలవుతాయని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

హైదరాబాద్ విషయానికి వస్తే రోజంతా పొడి వాతావరణం ఉంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్నిచోట్ల చిరుజల్లులు, ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు (ఆగస్ట్ 23, ఆదివారం) తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని... భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

44
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
Image Credit : Gemini AI

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో నేడు (ఆగస్ట్ 22) అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు కూడా తోడయితే పరిస్థితి ప్రమాదకరంగా మారతుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Recommended image3
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Related Stories
Recommended image1
Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్
Recommended image2
Heavy Rains Alert : బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved