MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • బలిదేవత సోనియా, ముద్దపప్పు రాహుల్ కు స్వాగతం... రేవంత్ రెడ్డి : హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

బలిదేవత సోనియా, ముద్దపప్పు రాహుల్ కు స్వాగతం... రేవంత్ రెడ్డి : హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో CWC సమావేశాల వేళ వినూత్న పోస్టర్లు వెెలిసాయి. కాంగ్రెస్ పార్టీ అధినాయకులపై గతంలో రేవంత్ చేసిన కామెంట్స్ తో పోస్టర్లు ఏర్పాటుచేసారు. 

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 17 2023, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Hyderabad

Hyderabad

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అదిష్టానం మొత్తాన్ని హైదరాబాద్ లో దించి CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ అధినేత్రి సోనియా గాంధీతో హైదరాబాద్ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇలా అసెంబ్లీ ఎన్నకల ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ కు వినూత్న పోస్టర్లతో షాక్ ఇచ్చారు. గతంలో సోనియా, రాహుల్ గాంధీలపై రేవంత్ చేసిన విమర్శలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వ పథకాలను పోలుస్తూ సిడబ్యూసీ మీటింగ్ జరుగుతున్న హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో వాల్ పోస్టర్లు వెలిసాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Telangana Congress

Telangana Congress

తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అని... పలు సందర్భాల్లో రాహుల్ గాంధీని పప్పు అని ఆనాడు టిడిపిలో వున్న రేవంత్ రెడ్డి విమర్శించాడని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ లో చేరి పిసిసి పదవి దక్కగానే బలిదేవత కాస్త మంచిదేవత అయ్యిందని... పప్పు కాస్త నిప్పు అయ్యాడని ఎద్దేవా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సిడబ్యూసి సమావేశాల వేళ ఏకంగా పోస్టర్లు ఏర్పాటుచేయడం కలకలం రేపుతోంది.

311
Hyderabad

Hyderabad

బంజారాహిల్స్ తాజ్ కృష్ణా హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లోనే బలిదేవత అంటూ సోనియాగాంధీకి, ముద్దపప్పు అంటూ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నట్లు పోస్టర్లు వెలిసాయి. కాంగ్రెస్ నాయకులు హోటల్ కు చేరుకునే మార్గంలో ఈ పోస్టర్లు ఏర్పాటుచేసారు. 
 

411
Hyderabad

Hyderabad

అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల కంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు బేష్ అనేలా మరికొన్ని పోస్టర్లు ఏర్పాటుచేసారు. కరప్ట్ కాంగ్రెస్ మోడల్ వర్సెస్ కరెక్ట్ బిఆర్ఎస్ మోడల్ అంటూ వాల్ పోస్టర్లు వెలిసాయి. దళిత బంధు, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల గురించి వివరిస్తూ ఇలాంటివి కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో లేవని పోస్టర్లలో వివరించారు. 
 

511
Hyderabad

Hyderabad

ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు ఇస్తోందని... వీటిని అమలుచేసే చిత్తశుద్ది ఆ పార్టీకి లేదని బిఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్లలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు, ఇప్పటికే అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదంటూ పోస్టర్లు వున్నాయి. 
 

611
Hyderabad

Hyderabad

 తెలంగాణలోని దళిత సమాజం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం 'దళిత బందు' ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో అసలు ఇలాంటి పథకమే లేదన్నారు. ఆ రాష్ట్రాలు దళితులకు అందిస్తున్న నిధులు సున్నా అంటూ పోస్టర్ ఏర్పాటుచేసారు. 
 

711
Hyderabad

Hyderabad

ఇక తెలంగాణలో వికలాంగులకు రూ.4116 పెన్షన్ ఇస్తుంటే చత్తీస్ ఘడ్ రూ.500, హిమాచల్ ప్రదేశ్ రూ.1300, కర్నాటక రూ.1100, రాజస్థాన్ రూ.1250 ఇస్తోందంటూ మరికొన్ని పోస్టర్లు వెలిసాయి. వృద్దులకు కూడా కాంగ్రెస్ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అధిక పెన్షన్లు (రూ.2016) లభిస్తున్నాయని తెలిపారు.
 

811
Hyderabad

Hyderabad

రైతులకు భీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది లేదంటూ పోస్టర్లు వెలిసాయి. కేసీఆర్ సర్కార్ రైతులకు రూ.5 లక్షల బీమా అందిస్తుంటే చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో సున్నా అంటూ ఎద్దేవా చేస్తూ పోస్టర్లు వెలిసాయి. 

911
Hyderabad

Hyderabad

రైతు బంధ కింద తెలంగాణ రైతులకు ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందంటూ మరికొన్ని పోస్టర్లు ఏర్పాటుచేసారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకమే లేదని పేర్కొన్నారు. 
 

1011
Hyderabad

Hyderabad

తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ...  చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ ఈ పని చేయడంలేదంటూ పోస్టర్లు ఏర్పాటుచేసారు. 

1111
Hyderabad

Hyderabad

ఇలా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోస్టర్లు వెలిసాయి.  అయితే ఈ పోస్టర్లపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు.  ఇది ముమ్మాటికీ బిఆర్ఎస్ పనేనని... రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండటంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

 
 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved