Telangana ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చూసే లింకులు ఇవే
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఇలా ఫలితాలు ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) 2025 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బోర్డు కార్యదర్శి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్ మరియు ఓకేషనల్ కోర్సులకు సంబంధించినవే.
అధికారిక వెబ్‌సైట్లు
ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్లు:
https://tgbie.cgg.gov.in
https://results.cgg.gov.in
ఫలితాలను ఇలా చెక్ చేయాలి
హోమ్‌పేజీలో “TS Inter Supplementary Result 2025” అనే లింక్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ఫలితాలు స్క్రీన్ పై కనపడతాయి.
విద్యార్థులకు సూచనలు:
ఫలితాలు చూసిన వెంటనే వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.భవిష్యత్ విద్యా ప్రణాళికల కోసం ఈ ఫలితాలు కీలకం కానున్నాయి.ఏవైనా డౌట్స్ లేదా సమస్యలు ఉన్నా, సంబంధిత కళాశాలలను సంప్రదించి సహాయం పొందవచ్చు.
మెరుగైన గ్రేడ్ కోసం
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముందుగా ఫెయిలైనవారు లేదా మెరుగైన గ్రేడ్ కోసం రాసినవారికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు విడుదలైన ఫలితాల ద్వారా వారు తమ విద్యార్హతను నిరూపించుకునే అవకాశాన్ని పొందారు.