MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మానవత్వం చాటుకున్న గవర్నర్ తమిళిసై.. విమానంలో ప్రయాణికుడికి ప్రథమచికిత్స.. (ఫొటోలు)

మానవత్వం చాటుకున్న గవర్నర్ తమిళిసై.. విమానంలో ప్రయాణికుడికి ప్రథమచికిత్స.. (ఫొటోలు)

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ విమానంలో ఓ ప్రయాణికుడికి అత్యవసర చికిత్స అందించి..ప్రశంసలు అందుకున్నారు.

1 Min read
Bukka Sumabala
Published : Jul 23 2022, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

హైదరాబాద్ : ఢిల్లీ- హైదరాబాద్ విమానంలో ప్రయాణిస్తున్న  ఓ ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్ అత్యవసర చికిత్సను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వారణాసి నుంచి ఢిల్లీ- హైదరాబాద్  విమానంలో గత అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

24
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో  తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా? అని  అనౌన్స్ చేశారు. విషయం తెలిసిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.

34
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

44
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నత వైద్య విద్య అభ్యసించిని ఉన్నత విద్యావంతురాలు. ఆమె ఎంబిబిఎస్, ఎండి- డిజిఓ లాంటి వైద్య విద్యా కోర్సులు చేసిన విషయం విదితమే. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved