జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: అందరి చూపు ఎంఐఎంపైనే
First Published Dec 6, 2020, 2:57 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఏ పార్టీకీ కూడ ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. దీంతో అందరి చూపు ఎంఐఎంపైనే ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. రెండు పార్టీలు కలిస్తేనే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా నెలకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మరో డివిజన్ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. 44 స్థానాలను కైవసం చేసుకొన్న ఎంఐఎం పైనే అందరి చూపు పడింది. టీఆర్ఎస్ కు అంశాల వారీగా ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఇటీవలనే ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?