జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: కారును వెంటాడిన బీజేపీ, టీఆర్‌ఎస్‌కి 6 వేల ఓట్లే అధికం
First Published Dec 6, 2020, 11:43 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలను బీజేపీ సాధించింది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహన్ని ఇచ్చాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేటర్ స్థానాలను కైవసం చేసుకొన్న బీజేపీ... టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. బీజేపీ కంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 6,066 ఓట్లు అధికంగా వచ్చాయి. బీజేపీకి 35.55 శాతం ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు 35.73 శాతం ఓట్లు వచ్చినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 4 కార్పోరేట్ సీట్లు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో 48 స్థానాలు దక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34,44,093 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 79,735 ఓట్లు చెల్లలేదు. 28,661 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?